అమెరికాలో ఒక్కో క్రిస్మస్ ట్రీ రూ. 5500

మెరికాలో ఏటా డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కడ చూసినా క్రిస్మస్ పండుగ సందడే కన్పిస్తది. ముఖ్యంగా రంగు రంగుల లైట్లతో అలంకరించిన క్రిస్మస్ ట్రీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తయి. కానీ.. ఈ ఏడాది మాత్రం అమెరికాలో ఒరిజినల్ క్రిస్మస్ ట్రీలు అంత ఈజీగా దొర్కుతలేవట. చాలామంది ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తున్నదట. ఇంతకూ అక్కడ క్రిస్మస్ ట్రీలకు కొరత ఎందుకు ఏర్పడిందంటే.. అందుకు చాలా కారణాలే ఉన్నాయని ఏకరువు పెడుతున్నారు వ్యాపారులు.

పదేండ్ల కిందటే ఎఫెక్ట్..

అమెరికాలో పదేండ్ల క్రితం ఓ ఏడాది క్రిస్మస్ ట్రీల పెంపకం తారస్థాయికి చేరిందట. దేశమంతా విపరీతంగా క్రిస్మస్ ట్రీలను పెంచడంతో పండగొచ్చేసరికి క్రిస్మస్ ట్రీలు పెద్ద ఎత్తున మార్కెట్లను ముంచెత్తాయి. దీంతో ధరలు విపరీతంగా పడిపోయాయి. అవసరానికి మించిన క్రిస్మస్ ట్రీలు మార్కెట్లలోకి రావడంతో చాలావరకూ వృథా అయ్యాయి. ఎంతో మంది వ్యాపారులు దివాలా తీశారు. దీంతో ఆ మరుసటి ఏడాది నుంచి ఆటోమేటిక్ గా ఈ వ్యాపారం ఏటా తగ్గుతూ వస్తున్నదట. ఒరిజినల్ క్రిస్మస్ ట్రీల వ్యాపారం అంత ఈజీ కాదని వ్యాపారులు చెప్తున్నారు. ఏడాది పాటు పెంచితే.. డిసెంబర్ నెలలో మాత్రమే గిరాకీ ఉంటుంది. దీనికి తోడు వాతావరణ మార్పుల వల్ల చెట్లు ఎక్కువగా చనిపోతుండటంతో చేతికందేదాకా తోట పరిస్థితి ఏంటో తెలియడం లేదు. అందుకే తరతరాలుగా సంప్రదాయంగా వస్తున్న క్రిస్మస్ ట్రీల వ్యాపారాన్ని కాదని యువత వేరే సులభమైన ఉపాధి మార్గాలను వెతుక్కుంటున్నారట. అలాగే ఆర్థిక మాంద్యం ఏర్పడటం, ధరలు పెరగడం వంటి అనేక కారణాల వల్ల కూడా ఈసారి క్రిస్మస్ ట్రీలు తగ్గిపోయాయని అంటున్నారు. దేశంలో 2012 నుంచి 2017 మధ్య దేశంలో క్రిస్మస్ ట్రీ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సంఖ్య 3% తగ్గిపోయాయని అమెరికా వ్యవసాయ శాఖ  వెల్లడించింది.

ఒక్కో చెట్టు 5,500
అమెరికాలో గత ఏడాది ఒక్కో క్రిస్మస్ ట్రీ ధర సగటున 78 డాలర్లు (రూ.5,500) పలికింది. అంతకుముందు ఏడాది కంటే ఇది 3 డాలర్లు (రూ. 200) ఎక్కువ. అయితే ఆ దేశంలో దాదాపు 70% పైగా ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీలే ఉంటున్నాయని, కానీ ట్రెడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫాలో కావాలనుకునే వాళ్లు మాత్రం ధరలు ఎక్కువైనా ఒరిజినల్ ట్రీల కోసం ప్రయత్నిస్తున్నారని పేర్కొంటున్నా రు

Latest Updates