పాతకాలం ఆహారం బెస్ట్: ఆర్గానిక్ ఫుడ్ తో ఆరోగ్యం

మారుతున్న ఆహారపు అలవాట్లతో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. కెమికల్ తో పండించిన ఆహారంతో   చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే మళ్లీ పాతకాలం ఆహారపు అలవాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. శిల్పారామంలో కొనసాగుతున్న ఆర్గానిక్ ఫెస్టివల్ కు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. ఆర్గానిక్ ఫుడ్ ప్రాడ్టక్స్, ఆయుర్వేద ఉత్పత్తుల సేల్స్ జోరుగా సాగుతున్నాయి.

శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఆర్గానిక్ ఫెస్టివల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఉమెన్ ఆఫ్ ఇండియా, కేంద్ర శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ ఫెస్టివల్ జరుగుతోంది. సేంద్రీ వ్యవసాయ పద్దతిలో పండించిన చిరు ధాన్యాలు, కూరగాయలు,  ఆహార పదార్థాలకు మంచి డిమాండ్ వస్తోంది. రాగులు, సజ్జలు, బెల్లం, పసుపు, రక రకాల మసాల దినుసులతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ జిల్లాల నుంచి తెచ్చిన సేంద్రీయ చిరుధాన్యాలకు మంచి గిరాకీ ఉందంటున్నారు మహిళా రైతులు.

దేశంలోని వివిధ రాష్ట్రాలల నుంచి మహిళా సేంద్రీయ వ్యవసాయదారులు, వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులను ఎగ్జిబిషన్ కమ్ సేల్ చేస్తున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులపై ప్రజలకు పెరుగుతున్న ఆసక్తిని తెలుసుకునేందుకు ఈ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఇందులో ఉత్పత్తుల ధరలు బయటితో పోలిస్తే కాస్త ఎక్కువే అనీ.. అయితే క్వాలిటీ బాగుందంటున్నారు.

దాదాపు 85 స్టాల్స్ వరకు ఏర్పాటు చేసి ఆర్గానిక్, హెర్బల్ ప్రొడక్ట్స్ ను అమ్ముతున్నారు. హైదరాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ రావడంతో స్టాల్స్ నిర్వాహకులు, మహిళా ఆంట్రప్రిన్యూర్స్ సంతోషంగా ఉన్నారు. సహజ సిద్దంగా వివిధ రకాల ఔషధాలతో తయారు చేసిన ఆయుర్వేద ఉత్పత్తులకు కూడా డిమాండ్ బాగుందంటున్నారు. ఆర్గానిక్ పిజా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఆర్గానిక్ ఉత్పత్తులను వాడకం పెరిగి, సేంద్రియ పంటలను ఎక్కువగా పండిస్తే… ధరలు తగ్గుతాయని చెబుతున్నారు జనం. ప్రభుత్వాలు కూడా సేంద్రీయ వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆర్గానిక్ ఫెస్టివల్ తో శిల్పారామంలో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఆరు రోజులపాటు జరిగే ఫెస్టివల్ ఈ ఆదివారంతో ముగుస్తోంది.

Latest Updates