అవయవ దానానికి మేముసైతం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పేద ప్రజలకు కూడా ఖరీదైన అవయవ మార్పిడి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని ఎంపీ కవిత అన్నారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్న సంకల్పం తో సీఎం కేసీఆర్ అవయవ మార్పిడి సర్జరీలను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చారని తెలిపారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ జాగృతి, జీవన్ దాన్ సంస్థ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో ఆర్డా న్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్నఎంపీ కవిత.. అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చారు. అంగీకార పత్రంపై సంతకం చేశారు. సీఎం కేసీఆర్ నిరంతరం ప్రజల హితం కోరుతూ కష్టపడుతున్నారని, ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు మంచి చేసే పనిని నిర్వహించా లన్న ఉద్దేశంతో దీన్ని చేపట్టినట్లు ఆమె వివరించారు. ప్రతి ఒక్కరూ అవయవ దానాని కి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అవయవదానంలో మన రాష్ట్రమే నంబర్ వన్ గా ఉందన్నారు.

నిమ్స్ తో తెలంగాణ జాగృతి ఒప్పందం

అవయవ దానంపై నిమ్స్ ఆస్పత్రితో తెలంగాణ జాగృతి ఒప్పందం చేసుకుంది. ఇందుకు సంబంధించిన పత్రాలపై ఎంపీ కవిత సంతకం చేశారు. జాగృతి తరఫున అవయ దానం చేసిన దాతల అవయవాల సేకరణ నిమ్స్ డాక్టర్లు చేపడతారు. కేసీఆర్ పుట్టినరోజున చేపట్టిన మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఏడాది పాటు సాగనుంది. ఈ ఏడాదిలో 50 వేల మందితో అవయవదానం చేయించాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. ఇందుకోసం తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. అవయవదానంపై అవగాహన కల్పించే విషయంలో కో ఆర్డినేటర్స్ పాత్ర ముఖ్యమైనదని, జాగృతి కార్యకర్తలు కో ఆర్టినేటర్స్ గా వ్యవహారించాలని ఆమె సూచించారు.

భారీ స్పందన

ఎంపీ కవితతో పాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్ , ఆంధోల్ ఎమ్మెల్యే క్రాంతి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అవయవ దానాని కి ముందుకు వచ్చారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ కు వారు అవయవ దానం పత్రాలను అందజేశారు. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్ యూనియన్ల సభ్యులు, స్టూడెంట్స్ , డాక్టర్లు సైతం అవయవదానాని కి చేతులు కలిపారు. ప్రజల్లో ఆర్గాన్ డొనేషన్ పై అవగాహన పెంచే విధంగా కృషి చేస్తా మని ప్రతిజ్ఞ చేశారు.

Latest Updates