ఏపీలో కొత్త‌గా 80 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. 24 గంటల్లో కొత్తగా 80 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సోమ‌వారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. జిల్లాల వారీగా కరోనా బాధితులు, పాజిటివ్, మ‌ర‌ణాలు, కోలుకున్నవారి వివరాలతో ఆరోగ్యశాఖ జాబితా విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1,177కి చేరిందని తెలిపింది.

వైరస్‌ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 31 మంది మరణించారని, 235 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని చెప్పింది. ప్రస్తుతం ఏపీలో 911 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు తెలిపిన ఆరోగ్య‌శాఖ‌.. గడిచిన 24 గంటల్లో ఎంటువంటి కోవిడ్‌ మరణాలు సంభవించలేదని చెప్పింది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న క్ర‌మంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపింది.

కొత్తగా నమోదైన కేసుల వివ‌రాలు

కృష్ణా జిల్లాలో- 33
గుంటూరులో -23
కర్నూలు జిల్లాలో- 13
నెల్లూరు జిల్లాలో -07
వెస్ట్ గోదావరి జిల్లాలో-03
శ్రీకాకుళంలో జిల్లాలో -01

Latest Updates