ట్రంప్ ఓడిపోతే 9/11 దాడి మళ్లీ జరగొచ్చు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది ఆఖరులో జరగనున్నయి. డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్, రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య పోరు జరగనుంది. ఇప్పటికే మొదలైన ఎన్నికల క్యాంపెయినింగ్ లో ఇరు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. తాజాగా ఈ ఎన్నికలపై ఒసామా బిన్ లాడెన్ మేన కోడలు నూర్ బిన్ లాడెన్ స్పందించారు. అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో బిడెన్ గెలిస్తే 9/11 తరహా అటాక్ మళ్లీ జరగొచ్చునని ఆమె చెప్పారు. దీనిని అడ్డుకోవడం ట్రంప్ వల్లే సాధ్యమవుతుందన్నారు.

‘ఒబామా/బిడెన్ పరిపాలనలో ఐసిస్ విస్తరించింది. వాళ్లు యూరప్ వరకు వచ్చారు. విదేశీ శక్తుల నుంచి మమ్మల్ని, అమెరికాను కాపాడగలనని ట్రంప్ నిరూపించారు. దాడి చేయడానికి ముందే టెర్రరిస్టులను మూలాల నుంచి నిర్మూలించారు. గత 19 ఏళ్లలో యూరోప్ లో జరిగిన టెర్రరిస్ట్ దాడులను గమనించండి. వాళ్లు మనల్ని తీవ్రంగా దెబ్బ తీశారు’ అని నూర్ పేర్కొన్నారు. తన తల్లితో కలసి మూడేళ్ల వయస్సు నుంచి అనేకమార్లు యూఎస్ కు వెళ్లానన్నారు. 2015లో అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నానని ప్రకటించినప్పటి నుంచి తాను ట్రంప్ కు మద్దతు ఇస్తున్నానని పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయాలను తాను ఆరాధిస్తానని చెప్పిన నూర్.. అమెరికాతోపాటు వెస్టర్న్ సివిలైజేషన్ భవిష్యత్ కు ఇది కీలకమన్నారు.

Latest Updates