జీతాలియ్యకుంటే బతికేదెట్లా

  • పైసలడిగితే కాంట్రాక్టర్ బెదిరిస్తున్నాడు
  • 4 నెలలుగా ఉస్మానియా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు

తార్నాక, వెలుగు: నాలుగు నెలలుగా జీతాలివ్వాలని ప్రాధేయపడుతున్న కాంట్రాక్టర్​పట్టించుకోకుండా బెదిరిస్తున్నారని ఉస్మానియా జనరల్​ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్​సోర్సింగ్​ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంక చేసేదేమి లేక సమ్మె పడతామంటున్నారు. వివరాల్లోకివెళితే….

ఉస్మానియా జనరల్​ ఆసుపత్రిలో నర్సింగ్, ఇతర టెక్నికల్​విభాగాలలో ఉద్యోగుల కొరత ఉండడంతో 2017లో అధికారులు ఔట్​సోర్సింగ్​పై ఉద్యోగులను నియమించేందుకు ఎస్.ఆర్​శంకరన్​​ సర్వీసెస్​ అనే సంస్థకు  కాంట్రాక్టు అప్పగించారు. హైదరాబాద్ కలెక్టరేట్​ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించి పేషెంట్​కేర్​సర్వీస్​ ప్రొవైడర్​ కేటగిరి కింద సుమారు 217 మందికి అవకాశం కల్పించారు. ఎంపికైన వారిలో విద్యార్హతను బట్టి70మంది  స్టాఫ్​నర్సులుగా, ఏఎన్ఎంగా, ల్యాబ్​టెక్నీషియన్​లుగా, ఎక్స్​రే టెక్నీషియన్, రేడియాలజిస్టు, ఫిజియోథెరపిస్టులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి టెక్నికల్​అర్హతలు లేని147మందిని వార్డులో సహాయకులుగా కేటాయించారు. వీరికి నెలకు రూ.12వేలు వేతనం నిర్ణయించారు.

తాము విధుల్లో చేరినప్పటి నుంచి ఎప్పుడూ సమయానికి జీతాలు ఇవ్వలేదని, ప్రస్తుతం నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగితే తన కాంట్రాక్టు అయిపోయిందని కాంట్రాక్టర్, జీతాల విషయంలో తమకు సంబంధం లేదని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్తున్నాడని ఉద్యోగులు చెప్తున్నారు.

రెన్యూవల్ కోసం కాంట్రాక్టర్​ ప్రయత్నాలు

కాంట్రాక్టర్​ ఉస్మానియాతో కుదుర్చుకున్న ఒప్పందం మూడు నెలల క్రితమే ముగిసింది. అయితే తాత్కాలిక ప్రాతిపదికన అతనికి అధికారులు ఇచ్చిన గడువు సైతం ఈ నెల18తో ముగిసింది. తిరిగి కాంట్రాక్టు సంపాదించేందుకు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

మాకు సంబంధం లేదు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, ఇతరవిషయాలతో తమకు ఎలాంటిసంబంధం లేదు. ఔట్ సోర్సింగ్ఉద్యోగులు అంతా కాంట్రాక్టర్ ఆధీనంలోపని చేస్తారని, వారికి సంబంధించినఅన్ని విషయాలు ఆయన పరిధిలోనేఉంటాయి. ఏమైనా సమస్యలు ఉంటేవారంతా కాంట్రాక్టర్ తోనేమాట్లాడుకోవాలి.నాగేందర్ , ఉస్మానియా హాస్పిటల్సూపరిం టెండెంట్

 బిల్లులు రానందుకే జాప్యం

ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు తనకు ప్రభుత్వం నుంచి బిల్లు లు రాలేదు. అందువల్లే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లిం చడంలో జాప్యం జరుగుతుంది. తన కాంట్రాక్ట్ గడువు ముగిసింది. తిరిగి రెన్యూవల్ కోసం ప్రయత్నిస్తు న్న.కాంట్రాక్ట్ తిరిగి తమ సంస్థకు వస్తే వేతనాలు చెల్లిస్తాం , లేకుంటే నేను ఏమి చేయలేను. నరేష్, కాంట్రాక్టర్

Latest Updates