OU ఎడ్‌సెట్–2020 నోటిఫికేషన్ విడుదల

రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్‌సెట్–2020 నోటిఫికేషన్ విడుదల చేసింది.  కంప్యూటర్ ఆధారంగా పరీక్ష నిర్వహించనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు, ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్లు ఈ ఎంట్రెన్స్  రాయడానికి అర్హులు. ఏప్రిల్ 20 వరకు ఆన్‌లైన్‌లో ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. మే , 23న  రాష్ట్ర వ్యాప్తంగా 16 సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నారు.

ఎలిజిబులిటీ

మ్యాథమెటిక్స్: మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా కనీసం 50 శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ లేదా బీఈ/బీటెక్‍ (మ్యాథమెటిక్స్), బీసీఏ (ఇంటర్‍లో మ్యాథ్స్ చదివుండాలి)  పాసై ఉండాలి.

ఫిజికల్‍ సైన్స్: ఫిజిక్స్, కెమిస్ర్టీలు సబ్జెక్టులుగా బీఎస్సీ లేదా బీఈ/బీటెక్‍ (ఫిజిక్స్&కెమిస్ర్టీ), బీసీఏ (ఇంటర్‍లో ఫిజిక్స్ & కెమిస్ర్టీ)  పాసై ఉండాలి.

బయాలజికల్‍ సైన్స్:

బీఎస్సీ/బీఎస్సీ హోంసైన్స్ (బోటనీ&జువాలజీ) లేదా బీసీఏ (ఇంటర్‍లో బయాలజీ చదివుండాలి)  పాసై ఉండాలి.

సోషల్‍ స్టడీస్‍:  బీఏ, బీకాం, బీబీఎం, బీబీఏ, బీసీఏ పాసై ఉండాలి.

ఇంగ్లిష్‍: బీఎ (స్పెషల్‍ ఇంగ్లిష్‍/ఆప్షనల్‍ ఇంగ్లిష్‍) /ఇంగ్లిష్‍ లిటరేచర్‍/ఎంఏ ఇంగ్లిష్ ఉత్తీర్ణత.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు డిగ్రీలో 40శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. బీఈ/బీటెక్‍ చదివిన వారికి మాత్రం 55 శాతం మార్కులు ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న వారు కూడా ఎడ్‌‌సెట్ ఎంట్రెన్స్ రాయవచ్చు. డిగ్రీ లేకుండా డిస్టెన్స్ లో పీజీ చేసిన వారు, ఎంబీబీఎస్, బీఎస్సీ అగ్రికల్చర్‍, బీవీఎస్సీ, బీఫార్మసీ, ఎల్‍ఎల్‍బీ చదివిన వారు  ఈ పరీక్ష రాయడానికి అనర్హులు.

వయసు: 2020 జూలై 1 నాటికి 19 సంవత్సరాలు నిండాలి.

ఫీజు: రూ.650. ఎస్సీ, ఎస్టీలు,  వికలాంగులకు రూ.450.

పరీక్షా కేంద్రాలు: రాష్ట్రంలోని 16 కేంద్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‍లో కర్నూలు, విజయవాడ లో ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి.

సిలబస్ అనాలసిస్

బీఈడీ ఎంట్రెన్స్ రాసేవారు ముఖ్యంగా 6వ తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు పాఠ్యపుస్తకాలను చదవాలి. ఎన్‌‌సీఈఆర్‌‌‌‌టీ రూపొందించిన పుస్తకాల నుంచే ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి వాటిని ప్రామాణికంగా తీసుకుని చదివితే సరిపోతుంది.  గతంలో ఇచ్చిన ప్రశ్నల సరళిని గమనించి ప్రిపేర్ అయితే మంచి మార్కులు సాధించవచ్చు.

పార్ట్ –ఎ

ప్రస్తుతం అన్ని ఎంట్రెన్స్  ఎగ్జామ్‌‌లలో ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్ట్‌‌గా ఉంది. ఎడ్‌‌సెట్‌‌ లో 25 మార్కులకు ఇంగ్లిష్ భాష పరిజ్ఞానంపై ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా బేసిక్ ఇంగ్లిష్ నాలెడ్జ్‌‌ను పరీక్షించే విధంగా ప్రశ్నల సరళి ఉంటుంది. ముఖ్యంగా..

 1. Reading Comprehension
 2. Correction of Sentences, Articles, Prepositions, Tenses, Spelling, Voice
 3. Vocabulary, Synonyms, Antonyms
 4. Transformation of Sentences –Simple, Compound and Complex. Direct Speech and Indirect Speech

(Syllabus: CBSE General English Syllabus (With effect from 2016–17)

పార్ట్–బి

జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ ఆప్టిట్యూడ్‌‌

జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఒక సబ్జెక్ట్‌‌పై కాకుండా ఎక్కడి నుంచైనా అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా  చుట్టూ ఉన్న పరిసరాలు,  ప్రస్తుతం  జరుగుతున్న పరిణామాలు, సమాజంపై అప్లికేబుల్‌‌గా ప్రశ్నలు అడుగుతారు. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు వివిధ సబ్జెక్టుల్లో చదువుతున్న అంశాలు, వివిధ దేశాలు, రాష్ట్రాలు, వాటి చరిత్ర, రాజధానులు, కరెన్సీ, పరిపాలనా కాలాలు, చరిత్రలోచోటు చేసుకున్న ముఖ్యమైన ఘటనల గురించి ప్రశ్నలు అడిగే చాన్స్ ఉంది.  ముఖ్యమైన వ్యక్తులు, వారు పొందిన సత్కారాలు, బిరుదులు, అవార్డులు, క్రీడలు, రచనలు మొదలగు అంశాలను చదవాలి.

టీచింగ్ ఆప్టిట్యూడ్‌‌లో టీచర్‌‌‌‌గా పనిచేసే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలను పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. వివిధ మనస్తత్వాలు కలిగిన స్టూడెంట్స్‌‌ను అర్థం చేసుకుని వారికి పాఠాలు బోధించడానికి ఎంపిక చేసుకునే బోధన విధానాలు, తరగతి గదిలో టీచర్ ప్రవర్తన సంబంధించిన అంశాలను పరిశీలిస్తారు.  మొదటిసారి పరీక్ష రాసే వారికి ఈ క్వశ్చన్స్ కొత్తగా కనిపిస్తాయి. మోడల్ క్వశ్చన్స్ కోసం ప్రీవియస్  క్వశ్చన్ పేపర్ చూడాలి.

పార్ట్–సి

కంటెంట్‌‌

పార్ట్‌‌–సిలో ఆయా సబ్జెక్ట్‌‌ల వారిగా  కంటెంట్ ఉంటుంది. ఎగ్జామ్‌‌లో ఇది మేజర్ పార్ట్. 100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.  డిగ్రీలో చదువుకున్న సబ్జెక్ట్ ఆధారంగా మెథడాలజీని ఎంపిక చేసుకోవాలి.  ఆర్ట్స్ స్టూడెంట్స్ కు  సోషల్ మెథడాలజీ నుంచి, మ్యాథ్స్ స్టూడెంట్స్‌‌కు మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ స్టూడెంట్స్‌‌కు ఫిజికల్ సైన్స్, బయాలాజికల్ సైన్స్ మెథడాలజీ ఉంటుంది. 8, 9, 10 తరగతుల్లో ఆయా సబ్జెక్టుల్లో చాప్టర్లను బాగా చదవాలి.

మ్యాథ్స్‌‌: సమితులు, సంబంధాలు, ప్రమేయాలు, వర్గ సమీకరణాలు, ద్విపద సిద్ధాంతం, ప్రస్తరాలు, సంయోగాలు, మాత్రికలు, త్రికోణమితి, అనుక్రమాలు, శ్రేణులు, అవకలనీయం, పలు చాప్టర్లను చదవాలి.

ఫిజిక్స్‌‌: ఇంటర్ వరకు చదివిన టాపిక్‌‌లలో నుంచి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. నిర్వచనాలు, సిద్ధాంతాలు,  నియమాలు, మూలకాలు, ఇంపార్టెంట్  కెమికల్ రియాక్ష న్స్ మొదలగు వాటిపై దృష్టి పెట్టాలి.

బయాలజికల్ సైన్స్: జంతువులు, మొక్కలపై ప్రాథమిక అవగాహన, వివిధ జీవులలో శరీర నిర్మాణం, జీర్ణక్రియ, విసర్జక క్రియలు, మొక్కలలో కిరణ జన్య సంయోగ క్రియ  పలు అంశాలను తెలుసుకోవాలి

సోషల్ స్టడీస్: జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.  జాగ్రఫీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే చాన్స్ ఉంది.  చరిత్ర అంశాలు, ప్రాచీన నాగరికత, భారత రాజ్యాంగం, పరిపాలన అంగాలు, భారత ఆర్థిక వ్యవస్థ, వివిధ దేశాలలో సంబంధాలు,  మొదలగు వాటికి సంబంధించిన అంశాలపై క్వశ్చన్స్ అడుగుతారు. యూనిట్ల వారీగా ప్రణాళిక వేసుకుని చదివితే టాప్ ర్యాంక్ సాధించవచ్చు.

– వెలుగు, ఎడ్యుకేషన్​ డెస్క్​

టీచింగ్ ఆప్టిట్యూడ్ మోడల్ క్వశ్చన్స్

 1. విద్యార్థులు నిర్ణయాలు తీసుకోవడం, యాజమాన్య నైపుణ్యాలు, సహ సంబంధాలపై శిక్షణ దేనికి సంబంధించినది.

ఎ. వృత్యంతర శిక్షణ

బి. జీవన నైపుణ్యాలు

సి. సాంకేతిక శిక్షణ డి. సాధారణ విద్య

 1. యోగ్యుడైన అభ్యాసకుడు

ఎ. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినేవాడు

బి.పరీక్షలకు చక్కగా సిద్ధమయ్యేవాడు

సి.ఉపాధ్యాయులను విద్యాపరమైన అంశాలలో ప్రశ్నించే ధోరణి కలవాడు

డి. గ్రంథాలయాలలో ఎక్కువ సమయం గడిపేవాడు

 1. అభ్యసన దేనిపై ఆధారపడి ఉంటుంది.

ఎ. స్మృతి మరియు తెలివితేటలు

బి. ఆసక్తి మరియు మూర్తిమత్వము

సి.శారీరక పెరుగుదల మరియు పరిణతి

డి. తెలివితేటలు మరియు సమయం

 1. రాతపరమైన అభ్యసన వైకల్యము

ఎ. డిస్‌లెక్సియా   బి. అలెక్సియా

సి. డిస్‌గ్రాఫియా    డి. అగ్రాఫియో

 1. కింది వాటిలో అభ్యసన లక్షణము

ఎ. అభ్యసనము అంటే పాఠశాలలో నేర్చుకునేది

బి. అభ్యసము జన్మత: వస్తుంది.

సి. అనుభవం వల్ల పొందే ప్రతి మార్పు అభ్యసనమే

డి. ప్రేరణ లేకపోయినా అభ్యసనము ఉంటుంది.

 1. బోధన అనునది?

ఎ. ఒక నైపుణ్యము               బి. ఒక వైఖరి

సి. సహజ సామర్థ్యము

డి. విషయ పరిజ్ఞానము

 1. ఒక ప్రధానోపాధ్యాయుడి నుంచి ఉపాధ్యాయునకు పంపే సమాచార ప్రక్రియ

ఎ.ఊర్ధ్వముఖల    బి.అధోముఖ

సి .పార్వ్వ            డి. సమాంతర

 1. కుదించబడిన బోధనా పద్ధతి

ఎ. స్థూల బోధన

బి. జట్టు బోధన

సి. సహకార బోధన

డి. సూక్ష్మ బోధన

 1. ప్రస్తుత కాలంలో ఎక్కువ ప్రభావవంతమైన అభ్యసన పద్ధతి

ఎ. ముఖాముఖి అభ్యసనము

బి. మిశ్రమ అభ్యసనము

సి. స్వీయ అభ్యసనము

డి. పైవేవీ కావు

 1. ఉపాధ్యాయ దినోత్సవం

ఎ. జూలై 11          బి. డిసెంబర్ 1

సి. అక్టోబర్ 2          డి. సెప్టెంబర్ 5

పరీక్షా విధానం

మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో పార్ట్‌ ఏ లో జనరల్ ఇంగ్లిష్, పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్‌, టీచింగ్ ఆప్టిట్యూడ్, పార్ట్ సిలో కంటెంట్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ , బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఉంటుంది. ఇంగ్లిష్ మెథడాలజీ ఎంపిక చేసుకున్న వారికి ఇంగ్లిష్ కంటెంట్ 100 మార్కులు ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ తెలుగు, ఇంగ్లిష్ భాషలో ఉంటుంది. డిగ్రీలో చదివిన సబ్జెక్ట్‌  ఆధారంగా మెథడాలజీని ఎంచుకునే అవకాశం ఉంటుంది.

 

Latest Updates