ఓయూ కామన్​ పీజీ ఎంట్రన్స్​–2020 నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివ‌‌ర్సిటీల్లో 2020–21 అకడమిక్​ ఇయర్​కు పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్స్​కు ఉస్మానియా యూనివ‌‌ర్సిటీ(ఓయూ) కామ‌‌న్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్​ టెస్ట్​(సీపీజీఈటీ-–2020)కు నోటిఫికేష‌‌న్ రిలీజ్​ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్​లైన్​లో అప్లికేషన్లు కోరుతోంది.

కోర్సులు: పీజీ (ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంసీజే, ఎంఈడీ, ఎంపీఈడీ), పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్​(ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ).

అర్హత: క్వాలిఫైయింగ్ డిగ్రీ/ (ఇంటిగ్రేటెడ్​ కోర్సులకు)ఇంట‌‌ర్మీడియ‌‌ట్ పాసైన/ ఫైనల్​ ఇయర్​ఎగ్జామ్స్​కు హాజ‌‌రైన‌‌ స్టూడెంట్స్​ అర్హులు.

ఎంపిక: క‌ంప్యూట‌‌ర్ బేస్డ్ ఎంట్రన్స్​

సబ్జెక్టులు

ఆర్ట్స్​: ఎంఏ–ఏన్షియంట్​ ఇండియన్​ హిస్టరీ కల్చర్​ అండ్​ ఆర్కియాలజీ(ఏఐహెచ్​సీఏ), అరబిక్​, ఇంగ్లిష్​, హిందీ, కన్నడ, మరాఠి, పర్షియన్​, సంస్కృతం, తెలుగు, ఉర్దూ, ఇస్లామిక్​ స్టడీస్​, లింగ్విస్టిక్స్, ఫిలాసఫి, థియేటర్​ ఆర్ట్స్​.

సోషల్​ సైన్సెస్​: ఎంఏ: ఎకనామిక్స్​, జెండర్​స్టడీస్​, హిస్టరీ, జర్నలిజం అండ్​ మాస్​ కమ్యూనికేషన్​, మాస్టర్​ ఆఫ్​ లైబ్రరీ సైన్స్​(రెండేళ్లు), బ్యాచులర్​ ఆఫ్​ లైబ్రరీ సైన్స్​(ఏడాది), మాస్టర్​ ఆఫ్​ లైబ్రరీ అండ్​ ఇన్ఫర్మేషన్​ సైన్స్​(ఏడాది), ఎంఎస్​డబ్ల్యూ, ఎంహెచ్​ఆర్​ఎం, ఎంటీఎం, పొలిటికల్​ సైన్స్, సైకాలజీ, పబ్లిక్​ అడ్మినిస్ట్రేషన్​, సోషియాలజీ., కామర్స్​: ఎంకాం., ఎడ్యుకేషన్​: ఎంఎడ్​, ఎంపీఎడ్​.

సైన్స్​: ఎంఎస్సీ– బోటనీ, కెమిస్ట్రి, కంప్యూటర్​ సైన్స్​, ఎలక్ట్రానిక్స్​, జాగ్రఫి, జియో ఇన్ఫర్మేటిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్​, ఫిజిక్స్​, స్టాటిస్టిక్స్, జూవాలజీ, బయో కెమిస్ట్రి/ఎన్విరాన్​మెంటల్​ సైన్స్​/ఫోరెన్సిక్​ సైన్స్​/జెనెటిక్స్​/ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, న్యూట్రిషన్​ అండ్​ డైటిక్స్​, ఫుడ్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీ, సైకాలజీ.

పీజీ డిప్లొమా: పీజీడీ– చైల్డ్​ సైకాలజీ, జాగ్రఫికల్​ కార్టోగ్రఫి, సైకలాజికల్​ కౌన్సెలింగ్​, సెరికల్చర్​.

ఇంటిగ్రేటెడ్​(ఐదేళ్లు): బయోటెక్నాలజీ, కెమిస్ట్రి/ఫార్మాస్యూటికల్​ కెమిస్ట్రి, ఎకనామిక్స్​, ఎంబీఏ.

ఎంట్రన్స్​ ప్యాటర్న్​: ఎంట్రన్స్​ ఎగ్జామ్​ 100   ప్రశ్నలకు ఆబ్జెక్టివ్​ పద్ధతిలో ఉంటుంది. 90 నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఫీజు: జనరల్​ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు రూ.600, అదనపు సబ్జెక్ట్​రాయలనుకునే వారికి రూ.450 అదనం.

అడ్మిషన్స్​   కల్పించే  వర్సిటీలు: ఉస్మానియా, కాకతీయ,  తెలంగాణ,  మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన,  జేఎన్​టీయూహెచ్​

ప‌‌రీక్ష తేదీలు: 31 అక్టోబర్​ నుంచి

ఎగ్జామ్​ సెంటర్లు:  హైదరాబాద్​, ఆదిలాబాద్, కరీంనగర్​, ఖమ్మం, కోదాడ, నల్గొండ, మహబూబ్​నగర్​,  వరంగల్​,  నిజామాబాద్​.

చివ‌‌రి తేది: 19 అక్టోబర్​ 2020

వెబ్​సైట్​: www.osmania.ac.in

 

Latest Updates