షుగర్ బాధితులు, లావుగా ఉన్నోళ్లకే ఎక్కువ ప్రమాదం

కరోనా తీవ్రతను బాడీలో పెంచుతోంది మన బ్యాక్టీరియానే

అమెరికా సైంటిస్టుల స్టడీ

హ్యూస్టన్​/న్యూఢిల్లీ: మామూలుగా మన ఒంట్లో కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి. అందులో మంచి చేసేవి ఉన్నాయి.. ముప్పు తెచ్చేవీ ఉంటాయి. ఇప్పుడు మన ఒంట్లోని ఆ బ్యాక్టీరియానే కరోనాకు హెల్ప్​ చేస్తోందట. మహమ్మారి ముప్పును, తీవ్రతను పెంచేసి ప్రాణాల మీదకు తెస్తోందట. అమెరికాలోని యూనివర్సిటీ ఆప్​ టెక్సస్‌​ సౌత్ వెస్టర్న్​ మెడికల్​ సెంటర్​ సైంటిస్టుల స్టడీలో ఈ విషయం తేలింది. అయితే, ఆ ముప్పు ఎక్కువగా లావుగా ఉన్నవాళ్లు, షుగర్​తో బాధపడుతున్నోళ్లలోనే ఉందంటున్నారు వర్సిటీ సైంటిస్టులు. నిజానికి లావుగా ఉన్నవాళ్లు, షుగర్​తో బాధపడేవాళ్లలో లంగ్స్ ఇన్​ఫెక్షన్​ నుంచి తొందరగా బయటపడతారన్న వాదనలున్నాయని, మరి కరోనా విషయంలో అది ఎందుకు జరగట్లేదని ప్రశ్నిస్తున్నారు. దానికి కారణం, వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక లంగ్స్​లోకి వెళ్లేందుకు మనలో ఉండే ఏసీఈ2 రిసెప్టర్లు సహకరిస్తున్నాయని, అక్కడ మన ఒంట్లో ఉండే
బ్యాక్టీరియా (మైక్రోబయాటా) కరోనాతో జతకట్టి వైరస్ ముప్పును పెంచుతోందని తేల్చారు. డయాబెటిక్​ పేషెంట్లు, లావుగా ఉన్నోళ్లలో ఆ ముప్పు ఎక్కువగా ఉందని హెచ్చరించారు. బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే లైపోపాలీసాకరైడ్​(ఎల్​పీఎస్ ) అనే మాలిక్యూల్స్​ కరోనా వైరస్‌తో కలిసి మంచిగున్న కణాలను పాడు చేస్తున్నాయని గుర్తించారు. దాంతో సైటోకైన్​ స్టార్మ్​ ఎక్కువవుతోందని సైంటిస్టులు తేల్చారు.

యాంటీవైరల్​ మందులకు కేంద్రం అనుమతి: సుప్రీం
కరోనా పేషెంట్ల ట్రీట్‌మెంట్‌కు రెమ్డెసివిర్, ఫావిపిరావిర్ వంటి యాంటీ వైరల్ మందులకు కేంద్రం అనుమతిచ్చిందని సుప్రీంకోర్టు చెప్పింది. ఏ లైసెన్సూ లేకుండా ఆ మందులు తయారుచేస్తూ అమ్ముతున్న 10 ఫార్మా కంపెనీలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సీజేఐ ఎస్ ఏ బోబ్డె, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యంలతో కూడిన
బెంచ్ బుధవారం విచారించింది. న్యూడ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2018ని గుర్తుచేసిన బెంచ్ .. ఆ మందుల వాడకానికి కేంద్రం అనుమతిచ్చిందని పేర్కొంది. ఆ రూల్ చూడకుండానే పిటిషన్ వేశారంటూ పిటిషనర్‌కు చురకలంటించింది.

For More News..

ఎల్ఆర్ఎస్ చార్జీల భారం తగ్గేది కొందరికే!

అభిమానుల చూపంతా ధోని ఐపీఎల్ ఆటపైనే..

ఉద్యోగం పోయినోళ్లకు నయా జాబ్స్..

Latest Updates