మన బ్రహ్మోస్​ సక్సెస్

దేశీ సిస్టమ్స్​తో మిసైల్​.. ఆత్మనిర్భర్ వైపు అడుగులు

బాలేశ్వర్‌‌‌‌‌‌‌‌: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఆత్మనిర్భర్​ భారత్​ పిలుపులో మరో అడుగు పడింది. శక్తిమంతమైన బ్రహ్మోస్​ క్రూయిజ్​ మిసైల్​కు దేశీ హంగులు అద్దింది డిఫెన్స్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ ఆర్గనైజేషన్​ (డీఆర్డీవో). సొంతంగా తయారుచేసిన మిసైల్​ బూస్టర్లు, ఎయిర్​ఫ్రేమ్​ సెక్షన్లతో పాటు మరికొన్ని సబ్​సిస్టమ్​లను చేర్చి బ్రహ్మోస్​కు మరింత శక్తినిచ్చింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఒడిశాలోని బాలేశ్వర్​ ఇంటిగ్రేటెడ్​ టెస్ట్​ రేంజ్(ఐటీఆర్) సెంటర్​లో కాంప్లెక్స్​3 నుంచి ఈ మిసైల్​ను ప్రయోగించింది. ఆ ప్రయోగంలో ‘మన బ్రహ్మోస్’ సూపర్​ సక్సెస్​ అయిందని తెలిపింది. అన్ని విషయాల్లోనూ మిసైల్​ దూసుకుపోయిందని పేర్కొంది. ఆ ప్రయోగంపై డీఆర్డీవో బుధవారం ప్రకటన చేసింది. ఈ సక్సెస్​తో మన దేశంలోనే మిసైల్​ బూస్టర్లు, ఇతర పరికరాలను తయారుచేసేలా ఆత్మనిర్భర్​ భారత్​కు బాటలు పడ్డాయని పేర్కొంది. డీఆర్డీవో సిబ్బంది, బ్రహ్మోస్​ టీమ్​కు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, డీఆర్డీవో చైర్మన్​ అభినందనలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత స్పీడ్​గా దూసుకెళ్లే సూపర్​సోనిక్​ క్రూయిజ్​ మిసైల్​ బ్రహ్మోస్​. రష్యాకు చెందిన ఎన్​పీవోఎంతో కలిసి డీఆర్డీవో మన దేశంలోనే వీటిని తయారు చేస్తోంది.

400 కిలోమీటర్ల రేంజ్​..

భూమి, సముద్రం(సబ్​మెరీన్లు), యుద్ధ విమానాల నుంచి ప్రయోగించొచ్చు. ప్రస్తుతం టెస్ట్​ చేసిన మిసైల్ వెర్షన్​ 400 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను నాశనంచేసే సత్తా ఉన్న ల్యాండ్​ అటాక్​ క్రూయిజ్​ మిసైల్​(ఎల్​ఏసీఎం). దీని స్పీడ్​మాక్​ 2.8. అంటే సౌండ్​ కన్నా 2.8 రెట్ల వేగంతో మిసైల్​ దూసుకెళ్తుంది. 450 కిలోమీటర్ల టార్గెట్లను ఛేదించే మీడియం రేంజ్​ మిసైల్​ను 2017 మార్చి 11న, 300 కిలోమీటర్ల షార్ట్​ రేంజ్​ మిసైల్​ను పోయినేడాది సెప్టెంబర్​ 30న డీఆర్డీవో టెస్ట్​ చేసింది. తాజాగా తీసుకొచ్చిన ఎక్స్​టెండెండ్​ వెర్షన్​ మిసైల్​ 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇప్పటికే ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​కు కొన్ని మిసైల్స్​ను రక్షణ శాఖ అప్పగించింది.

For More News..

నవంబర్‌‌ 4 నుంచి మహిళల ఐపీఎల్‌‌ !

ఎవరు పడితే వాళ్లతో ఆస్తుల సర్వే

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయలేం

Latest Updates