బీజేపీ ఎంపీ కారుపై బాంబు అటాక్

పశ్చిమబెంగాల్ లో బరాక్ పూర్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ పై దాడి జరిగింది. కంకినారా నుండి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులెవరో ఆయన కారుపై ఇటుకలతో దాడి చేశారు. తర్వాత కారు దగ్గర్లో ఓ  బాంబు విసిరేసారు. ఈ ప్రమాదం నుండి ఆయన క్షేమంగా బయటపడ్డారు. దీనిపై స్పందించిన అర్జున్ సింగ్  తనపై తృణమూల్ కాంగ్రెస్ నేతలే దాడి చేశారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో శాంతి భద్రతలు లేవనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అర్జున్ సింగ్ .దీనిపై విచారిస్తున్నారు పోలీసులు.

Latest Updates