మన దేశం ఘనత పిల్లలకు చెప్పాలి

మన దేశ చరిత్ర చిన్నారులకు తెలియాలి. సంప్రదాయలను కూడా పిల్లలకు ప్రాక్టికల్​గా అలవాటు చేయించే ఐడియాలు చాలా ఉన్నాయి. వాటిని పేరెంట్స్​ పిల్లలకు చిన్నప్పుడే నేర్పిస్తే, బాగా ఎంజాయ్​ చేస్తారు. అంతేకాదు నేచర్​, విలేజ్​ లైఫ్​కు కనెక్ట్​ అవుతారు. ప్రాక్టికల్​ నాలెడ్జ్​ ఉన్నప్పుడు పిల్లలకు కాన్ఫిడెన్స్​, పాజిటివిటీ పెరుగుతాయి.

మన దేశ సంప్రదాయాలు, కల్చర్​​, చరిత్రను తెలుసుకోవడానికి పెద్దపెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. ఏ ఇండియన్​ ఆర్ట్, క్రాఫ్ట్​ చూసినా స్పష్టంగా అర్థమవుతుంది.  ఇవన్నీ తరాలు మారుతున్న కొద్దీ మరుగున పడిపోతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే.. పిల్లలకు వాటిని ఆర్ట్, క్రాఫ్టింగ్​ రూపంలోనైనా పరిచయం చేయాలి. అప్పుడు వాళ్లలో క్రియేటివిటీతో పాటు దేశ కల్చర్​​పై గౌరవం పెరుగుతుంది. 

పిల్లలకు థియరీ కంటే ప్రాక్టికల్​గా చేసి చూపి​స్తేనే చాలా వాటిపై ఇంట్రెస్ట్, నాలెడ్జ్​ పెరుగుతాయి. మన దేశ చరిత్ర, సంప్రదాయాలను కూడా ప్రాక్టికల్​గా అలవాటు చేయించే ఐడియాలు చాలా ఉన్నాయి. వాటిని పేరెంట్స్​ పిల్లలకు చిన్నప్పుడే నేర్పిస్తే, బాగా ఎంజాయ్​ చేస్తారు. అంతేకాదు నేచర్​, విలేజ్​ లైఫ్​కు కనెక్ట్​ అవుతారు. ప్రాక్టికల్​ నాలెడ్జ్​ ఉన్నప్పుడు పిల్లలకు కాన్ఫిడెన్స్​, పాజిటివిటీ పెరుగుతాయి.  అలాంటి ఆర్ట్​ అండ్​ క్రాఫ్టింగ్​ ఏంటో చూద్దాం..

పాట్​ పెయింటింగ్​

 ఒకప్పుడు ఇళ్లంటే మట్టి గోడలు, వంటింట్లో గిన్నెలంటే మట్టి పాత్రలే ఉండేవి. కానీ మెల్లిగా పెద్దపెద్ద బిల్డింగ్​లు, ప్లాస్టిక్​ సామాన్లు వచ్చేశాయి. దాంతో పిల్లలకు మట్టితో ఎలాంటి కనెక్షన్​ ఉండట్లేదు. అందువల్ల ఇంట్లో మట్టి కుండలు, పాత్రలు ఉండేలా చూడాలి. అలాగే వాళ్లకు గుజరాత్​కి చెందిన ఖావ్డా పాటరీ, రాజస్థాన్​కి చెందిన బ్లూ పాటరీ డిజైన్లు చూపించాలి. ఎంత టెక్నాలజీ పెరిగినా బోనాలు,  సంక్రాంతి పండుగలకు మట్టి కుండలు వాడే సంప్రదాయం ఇంకా ఉంది కాబట్టి వాటి విశిష్టత గురించి చెప్పాలి.

పిల్లలకు చిన్నచిన్న కుండలు, శాండ్​పేపర్, కలర్​ పెయింట్స్​, రకరకాల బ్రష్​లు ఇవ్వాలి. ముందుగా కుండను శాండ్​పేపర్​తో శుభ్రంగా రుద్దమనాలి. తర్వాత కొన్ని డిజైన్స్ చూపించి పెయింట్​ చేయించాలి. తర్వాత వాటిని ఎండలో పెట్టి పెయింట్​ని ఆరనివ్వాలి. ఇలా చేస్తే, ఇంట్లో కుండను చూసిన ప్రతిసారీ పిల్లలు హ్యాపీగా ఫీలవుతారు.​

తోరణం

ఇంటి దర్వాజలకు మామిడాకులతో తోరణాలు కట్టడం మన దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. పైగా మామిడాకుల్లో యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్​ లక్షణాలుంటాయని, అవి ఇంట్లో వాళ్ల ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెప్తుండాలి.  చిన్నపిల్లలకు మన దగ్గరున్న మామిడాకుల తోరణాలు కట్టే సంప్రదాయాన్ని నేర్పించాలి.

ఒకప్పుడు సంవత్సరంలో ప్రతిరోజూ గుమ్మానికి మామిడాకులు ఉండేవి. ఇప్పుడు కేవలం పండుగలు, శుభకార్యాలకే తోరణాలు కడుతున్నారు. ఇలా తోరణాలు కట్టే పనిని పిల్లలకు నేర్పించాలి. ఒక దళసరి దారం, పన్నెండు మామిడాకులు ఇవ్వాలి. ఆకులను ఒక్కొక్కటిగా దారానికి గుచ్చడం నేర్పించాలి. ఆ తోరణాన్ని ఇంటి గుమ్మానికి కడితే పిల్లలకు ఎంకరేజింగ్​గా ఉంటుంది.

వార్లీ ఆర్ట్​

మహారాష్ట్రకు చెందిన ఈ వార్లీ ఒక ట్రైబల్​ ఆర్ట్. ఈ ఆర్ట్​ డిజైన్​లో ఎక్కువగా ట్రయాంగిల్స్​ (త్రికోణాలు) ఉంటాయి. వాటితోనే బొమ్మలు, పిల్లల ఆటలను డిజైన్​ చేస్తారు. ఈ వార్లీ ఆర్ట్​ని ఒకప్పుడు సున్నంతో మట్టి గోడలపై వేసేవాళ్లు. అలాగే మట్టి కుండల మీద కూడా ఈ డిజైన్​ భలే అందంగా ఉండేది. తర్వాత కలర్​ పెయింట్స్​తో ఫ్యాబ్రిక్​ మీద డిజైన్​ చేయడం మొదలైంది. పేపర్​, చీరల మీద కూడా ఈ డిజైన్​ బాగుంటుంది.

ఈమధ్య ఫ్యాన్సీ, స్టేషనరీ స్టోర్స్​లో వార్లీ పెయిటింగ్​ కిట్స్​ అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో డార్క్​ కలర్​ (రెడ్​, ఆరెంజ్​, బ్రౌన్​) హ్యాండ్​మేడ్​ పేపర్స్​, వైట్​ కలర్​ అక్రిలక్​ పెయింట్​, వైట్​ స్కెచ్​ పెన్​, పెయింట్​ బ్రష్​ ఉంటాయి. వాటిని పిల్లల చేతికిచ్చి.. వార్లీ ఆర్ట్​ డిజైన్స్​ని చూపించాలి. ముందుగా హ్యాండ్​మేడ్​ పేపర్​ మీద పెన్సిల్​తో డిజైన్​ గీయించి, దానిపై పెయింట్​ వేయమని చెప్పాలి. ఆ పేపర్స్​ని ఇంట్లో గోడలకు అతికించొచ్చు లేదా గ్రీటింగ్​ కార్డ్స్​గా మార్చి ఫ్రెండ్స్​కి ఇవ్వొచ్చు.

ముగ్గును మరువనియ్యొద్దు

సౌత్​ ఇండియన్​ రాష్ట్రాల్లో కనిపించే ఈ ముగ్గు సంప్రదాయం రోజురోజుకీ కనిపించకుండా పోతోంది. ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేసే రోజులు పోయాయి. మట్టి రోడ్లు కాకుండా సీసీ రోడ్లు ఉండటంతో, కేవలం ఊడ్చేసి నీళ్లు చల్లుతున్నారు. కొందరైతే ప్లాస్టిక్​ ముగ్గు స్టిక్కర్లను అంటిస్తున్నారు. కానీ ఈ సంప్రదాయం ఇంకా పల్లెల్లో, సిటీల్లో కొన్నిచోట్ల కనిపిస్తోంది. ఈ ముగ్గు వేయడాన్ని పిల్లలకు చిన్నప్పట్నించే నేర్పించాలి.

ఈ జనరేషన్ అమ్మాయిలకు ముగ్గును పట్టుకోవడం కూడా రావట్లేదు. అందుకే పిల్లలకు రాయి లేదా సున్నం ముగ్గును చేత్తో పట్టించాలి. చిన్నచిన్న చుక్కల ముగ్గులతో స్టార్ట్​ చేయాలి. చుక్కలు పెట్టి కలపమనాలి. మొదట్లోనే ముగ్గు పట్టుకోవడం కష్టం కాబట్టి చాక్​పీస్​తోనైనా పువ్వులు, ఆకులు డిజైన్​ వేయించాలి. తర్వాత ముగ్గుతో అలవాటయ్యేలా చూడాలి. ముగ్గు డిజైన్లలో కూడా రకరకాలుంటాయి. వాటిని ఒక బుక్​లో వేసి పిల్లలకు ఇవ్వాలి. దాంట్లోంచి ఒక్కో ముగ్గును ట్రై చేయించాలి.

పిల్లలు ఎలా నేర్చుకుంటారు ?

పిల్లలు చదువుకోవటం అంటే నేర్చుకోవటం అనే. కొత్తగా ఏదీ నేర్పించలేని ఎడ్యుకేషన్ పిల్లలకు మార్కులు తెస్తుందేమో కానీ లైఫ్ స్కిల్స్ నేర్పించదు. అందుకే క్లాసులో నేర్చుకున్నది క్లాస్ రూం బయట కూడా పిల్లలకు కనిపించేలా చేయాలి. అది సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు లేదంటే కొత్త లాంగ్వేజ్ కావచ్చు. క్లాస్ అయిపోయిన తర్వాత కూడా అది వాళ్లకి లైఫ్ లో ప్రాక్టికల్ గా కనిపించాలి. దాన్నే  ఇంటరాక్టివ్ లెర్నింగ్ అంటారు.

జస్ట్ కంటెంట్ ని బట్టీ పట్టటమో, మార్కులు వచ్చేదాకా గుర్తుపెట్టుకోవటమో జరిగితే ఆ చదువు పనికి రాదన్నట్టే కదా. అందుకే పిల్లలు క్లాస్ లో ఏం వింటున్నారో దాన్ని పేరెంట్స్ గమనిస్తూ ఉండాలి. లాంగ్వేజ్ అయితే పేరెంట్స్ ఆ భాషల్లో కొద్దికొద్దిగా మాట్లాడటం చేయాలి. లేదంటే ఆ లాంగ్వేజ్ లో ఉండే కామిక్స్, టీవీషోస్ చూపించాలి. టెక్స్ట్ బుక్స్ లో కనిపించే చిన్న సైన్స్ ప్రయోగాలు  పిల్లలతో చేయించటం వల్ల కూడా వాళ్లకి లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చాలామంది పిల్లలకి ఇంగ్లీష్, మాథ్స్ అంటే భయం ఉంటుంది కానీ ఇంటరాక్టివ్ లెర్నింగ్ తో ఈ భయాలని ఈజీగా పోగొట్టొచ్చు.

ఇంటరాక్టివ్ లెర్నింగ్ వల్ల పిల్లల్లో ఎడ్యుకేషన్ మీద ఇంట్రస్ట్ పెరగటమే కాదు, పాఠంలో పూర్తిగా మునిగిపోతారు. కంటెంట్‌ని వాడుకోవటం మాత్రమే కాదు ఆ వస్తువులని ఎలా తయారు చేయాలి, పాడైతే ఎలా పనిచేయించాలి అనే విషయాలనూ పిల్లలు తెలుసుకోవటానికి ఇంటరాక్టివ్ లెర్నింగ్ హెల్ప్ అవుతుంది.

 

Latest Updates