కేసీఆర్ ను రాజకీయ సమాధి చేయడమే తమ లక్ష్యం

జనగామ లో నిన్న(మంగళవారం) కేవలం అయిదుగురు బీజేపీ కార్యకర్తలు మాత్రమే నిరసన తెలిపారని.. వారితో ఎలాంటి ఇబ్బందులు కలిగాయో తెలపాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. జనగామలో నిన్న పోలీసుల లాఠీచార్జ్ లో గాయపడిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడారు.

బీజేపీ కార్యకర్తలను CI, SI లు ఇద్దరు విచక్షణా రహితంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. శ్వాస ఆడడం లేదని వేడుకున్నా వదలలేదన్నారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్లో కొంతమంది IPS అధికారులు … బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేసి వారి రక్తం కళ్ళ చూస్తున్నారని ఆరోపించారు. ఆరేళ్ళ నుండి ఫామ్ హౌజ్ లో పడుకొని బయటకు రాని సీఎం ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని డిమాండ్ చేశారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండిస్తున్నారు.. కానీ మానవత్వం లేని కేసీఆర్ మాత్రం స్పందించలేదన్నారు. దేశంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు చేసుకోకూడదా అని ప్రశ్నించారు.

జనగామ ఘటనపై 24 గంటల్లో సీఎం స్పందించకుంటే తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు బండి సంజయ్. దాడిచేసిన వారిని వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు… వారిపై 307సెక్షన్లో కేసులు నమోదు చేయాలన్నారు. లేకపోతే నీ గడీలు బద్దలు కొడతామంటూ హెచ్చరించారు. నీ ఇంటలిజెన్స్ వ్యవస్థ కూడా మమ్మల్ని కనిపెట్టలేదన్న బండి..కేసీఆర్ కొడుకును కూడా వీపు చింతపండుచేసి సారీ చెప్తే సరిపోతుందా అని ప్రశ్నించారు.

Latest Updates