హామీలను నెరవేర్చడమే మా నినాదం

బిహార్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ

దర్భంగా: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ నినాదమని బిహార్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ అన్నారు. బిహార్‌లోని దర్భంగాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్నారు. తొలి విడత పోలింగ్ సందర్భంగా ఓట్లు వేసే సమయంలో ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు. రామ మందిర నిర్మాణం ఆరంభం నేపథ్యంలో బిహారీలకు మోడీ అభినందనలు తెలిపారు. ‘రామ మందిర నిర్మాణం మొదలైనందున సీతమ్మ కొలువైన రాష్ట్ర (బిహార్) ప్రజలకు అభినందనలు. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడమే మా నినాదం’ అని మోడీ చెప్పారు. ఈ ర్యాలీలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా పాల్గొన్నారు. దర్భంగాలో ఆలిండియా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటు చేయాలని నిర్ణయించినందుకు ప్రధాని మోడీకి నితీశ్ కృతజ్ఞతలు తెలిపారు.

Latest Updates