ఉపాధి లేక తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటున్న బాలీవుడ్ నటుడు

కరోనా వైరస్ అన్నీ రంగాలపై ఎఫెక్ట్ పడింది. దీంతో ఎక్కువ శాతం మంది ఉపాధిని కోల్పోతున్నారు. ముఖ్యంగా ఈ కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ పై ఎక్కువగా పడింది. కరోనా కారణంగా షూటింగ్ లేకపోవడంతో సినీ కార్మికులు ఉపాధి కోసం వేరే మార్గాల్ని అన్వేషిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్  తో గులామ్ సినిమాలో సహనటుడిగా యాక్ట్ చేసిన జావెద్ హైదర్  పొట్ట కూటికోసం తోపుడు బండిపై కూరగాయాలు అమ్ముకుంటున్నాడు. జావెద్ హైదర్ కూరగాయాలు అమ్ముకుంటున్న వీడియోను బిగ్‌ బాస్ ఫేమ్ డాలీ బింద్రా టిక్‌ టాక్‌ లో షేర్ చేసింది. ఉపాధి లేక జావెద్ హైదర్ తో పాటు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం డ్రీమ్ గార్ల్‌లో ముఖ్య పాత్ర పోషించిన నటుడు సోలంకి దివాకర్‌ ఉపాధి లేక పండ్లు అమ్ముకున్నాడు. ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన పండ్లు, కూరగాయలు అమ్ముకునేవారు. ఇప్పుడు లాక్ డౌన్ వలన షూటింగ్స్ అన్నీ బంద్ కావడంతో తిరిగి పాత వృత్తినే కొనసాగిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా ఆయన పండ్లు అమ్ముకుంటూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు.

Latest Updates