ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై నిఘా

  • ఇటీవల అక్రమాలతో ఉన్నతాధికారుల నజర్‍
  • కేటగిరీల మార్పిడితో సంస్థ ఆదాయానికి గండి
  • వాటర్ బోర్డులో మొదలైన ఆపరేషన్‍

హైదరాబాద్, వెలుగు: సంస్థ ఖజానాకు గండికొడుతున్న వాటర్ బోర్డు ఇంటి దొంగల గుట్టు రట్టవుతోంది. చంచల్‌ గూడ సెక్షన్‌ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అక్రమాలపై సీసీఎస్ పోలీసులు విచారిస్తుండగా, వాటర్ బోర్డు దిద్దుబాటు చర్యలకు దిగింది. కంప్యూటర్ లాగిన్​ఐడీ, పాస్ వర్డులతో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కొంతమంది ఉన్నతాధికారులతో సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో సిబ్బంది కదలికలపై వాటర్ బోర్డు నిఘా పెట్టింది. ఇందులో భాగంగానే ఉన్న 9.6లక్షల నల్లా కనెక్షన్ల వారీగా ఖైరతాబాద్ లోని సెం ట్రల్ సర్వర్ కేంద్రంను పర్యవేక్షిస్తున్నారు . కమర్షియల్ కేటగిరీలను డొమెస్టిక్ గా మార్చడం సంస్థ ఆదాయానికి లక్షల్లో కన్నం వేశారనే ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నారు.
ఔట్ సోర్సింగ్ సిబ్బందిదే హవా
నగరంలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి వేల కనెక్షన్లను డొమెస్టిక్ నుంచి కమర్షియల్ కేటగిరీలోకి మార్చినా
రాబడి విపరీతంగా తగ్గడంతో అనుమానం వ్యక్తం చేసిన అధికారులు… వాణిజ్య నల్లాలను
గృహ కేటగిరిలో మార్చడంతోనేని గుర్తించారు. ఒక్కో కమర్షియల్​ కనెక్షన్​ మార్చితే వేలలో, బల్క్
కనెక్షన్​ అయితే లక్షల్లో వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సంస్థలోని 200మంది డాటా
ఎంట్రీ ఆపరేటర్లు, డాటా ప్రోగ్రామింగ్ ఆపరేటర్ల హస్తం ఉందనే కోణంలో విచారణ సాగుతోంది.
రాజకీయ నేతల సన్ని హితులు, బంధువులుగా చలామణి అవుతూ సంస్థలోని కొం దరు ఉన్నతాధికారులు చాలా కాలంగా ఈ పోస్టుల్లో కొనసాగుతున్నారని తెలుస్తోంది. ఏళ్లపాటు ఒకేచోట
తిష్టవేస్తూ గుట్టు చప్పుడు కాకుం డా మోసాలకు పాల్పడుతూ లక్షలు దండుకుంటున్నారని ఆరోపణలున్నా యి. అయితే వీరికి సహకరిస్తున్న ఉన్నతాధికారుల కదలికలపై వాటర్ బోర్డులో దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. సంస్థ ఆదాయానికి గండి కొడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
కొనసాగుతున్న విచారణ
కేటగిరీలను మార్చి అక్రమాలకు పాల్పడిన ఘటనపై ఇంకా పోలీసులు విచారిస్తుండగా, ఎన్ని నల్లా కనెక్షన్ల కేటగిరీలూ మారిపోయాయి? ఎవరీ పాత్ర ఉందీ ? అధికారుల లాగిన్ ఐడీలను
నిజంగానే దొంగలించారా? లేదా ఉన్నతాధికారుల పాత్ర ఏదైనా ఉందా? ఏ మేరకు నష్టం వాటిల్లిందనే అంశాన్ని తేల్చే పనిలో సీసీఎస్ పోలీసులు ఉన్నారు . పదుల సంఖ్యలో కనెక్షన్ల కేటగిరీలూ మారిపోయినట్లుగా తెలుస్తోంది.

Latest Updates