5 లక్షలు దాటిన కరోనా కేసులు

  • 24 గంటల్లో 18,552 పాజిటివ్‌ కేసులు
  • 15,685 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. 24 గంటల్లో దాదాపు 18,552 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్రం హెల్త్‌ బులెటెన్‌ రిలీజ్‌ చేసింది. ఒక రోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి అని అధికారులు చెప్పారు. దీంతో ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 5,08,953కి చేరింది. 24 గంటల్లో 384 మంది చనిపోయారు. చనిపోయిన వారి సంఖ్య 15,985కి చేరింది. మన దేశంలో జనవరిలో మొదటి కేసు నమోదు కాగా.. 149 రోజుల్లో ఐదులక్షల కేసులు నమోదయ్యాయి. వారం రోజులుగా దాదాపు 14వేల కేసులు నమోదవుతుండగా.. శుక్రవారం 17వేల కుసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 65844 కేసులు ఉన్నాయి. 7,106 మంది చనిపోయారు. తమిళనాడులో 32,208 కేసులు నమోదు కాగా.. 957 మంది చనిపోయారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ కేసుల సంఖ్యలో ఆర్థిక రాజధాని ముంబైని దాటేసింది. ఢిల్లీలో ప్రస్తుతం 27,657 కేసులు ఉండగా.. 2,492 మంది వ్యాధి బారినపడి చనిపోయారు.

Latest Updates