100 ఆర్మీ ఉద్యోగాలకు 2 లక్షల మంది అమ్మాయిలు పోటీ

దేశం కోసం సేవ చేసేందుకు మేము సైతం అంటున్నారు అమ్మాయిలు. బోర్డర్ లో తుపాకీ పట్టుకునేందుకు మహిళలు కూడా ముందుకువస్తున్నారు. ఆర్మీలో చేరేందుకు ఉత్సహం చూపిస్తున్నారు. ఇప్పటివరకు భారత ఆర్మీలో మహిళా సైనికుల సంఖ్య చాలా తక్కువ. మహిళలు సైన్యంలో చేరేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగా  ఆర్మీ మహిళా విభాగాల్లో 100 ఉద్యోగాలకు ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పోస్టులకు రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. విడుదల చేసిన పోస్టులన్నీ యుద్ధ రంగంలో ప్రత్యక్షంగా తలపడే జవాను ఉద్యోగాలే. ఇప్పటికే IAF ( భారత వాయు సైన్య దళం) ఆరుగురు మహిళలు సైనిక పైలట్లుగా శిక్షణ పొందుతున్నారు.

15 లక్షల మందితో మరొక బలమైన ఆర్మీ ( కార్ప్స్‌ ఆఫ్‌ మిలిటరీ పోలీస్‌) తయారు చేసేందుకు భారత ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రాష్ట్రాల వారీగా ‘మహిళా ప్రోవెస్ట్‌ యూనిట్‌’ను ఇద్దరు అధికారులు, ముగ్గురు జూనియర్‌ కమిషన్‌ అధికారులతో 40 మంది సైనికులు ఉండేలా తయారు చేయబోతుంది. దీనికి సంబంధించిన ఫైనల్ ఆమోదముద్రకు ఫైల్ రెడీగా ఉందని తెలిపాయి ఆర్మీ వర్గాలు.

Latest Updates