ఒకే బ్యాంకులో 38 మంది ఎంప్లాయీస్‌కు కరోనా

తిరుచిరప్పల్లి: దేశంలో కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. ఇండియాలోని చాలా ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ కూడా మొదలైందన్న విషయం భయాందోళనలను పెంచుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడులోని ఒకే బ్యాంకులో పని చేస్తున్న 38 మంది ఉద్యోగులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. తమిళనాడు, తిరుచిరప్పల్లిలోని 38 మంది నేషనల్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఎంప్లాయీస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు, లోకల్ సివిక్ బాడీ తెలిపారు.

అధికారులు చెప్పిన దాని ప్రకారం.. రీసెంట్‌గా బ్యాంకును సందర్శించిన కస్టమర్స్‌ స్వచ్ఛందంగా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఈమధ్యే ఇదే బ్యాంకులో పని చేస్తున్న ఓ సీనియర్ అధికారి కరోనా కారణంగా చనిపోయారు. రీసెంట్‌గా బ్యాంకులో పని చేస్తున్న ఉద్యోగులకు టెస్టింగ్స్ నిర్వహించగా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయని అఫీషియల్స్ తెలిపారు. బ్యాంకును డిసిన్‌ఫెక్ట్‌ చేశామని, సోమవారం నుంచి కార్యకలాపాలు పున:ప్రారంభం అవుతాయన్నారు.

Latest Updates