ఆంక్షల టైమ్‌లో 34 వేలకు పైగా ఫోన్ కాల్స్

1,227 మంది కాశ్మీరీలకు అత్యవసర సేవలు అందించిన సీఆర్పీఎఫ్

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్​లో ఆంక్షలు విధించిన సమయంలో అక్కడి వాళ్ల పరిస్థితులు తెలుసుకునేందుకు 34 వేలకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. కాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ రద్దు నిర్ణయం ప్రకటించగానే శ్రీనగర్ లో టెలిఫోన్, ఇంటర్నెట్ సర్వీసులను కొద్దిరోజులపాటు నిలిపివేశారు. ఆ సమయంలో కాశ్మీరీలకు సాయపడేందుకు సీఆర్పీఎఫ్.. ఈ ఏడాది జూన్ లో ఏర్పాటు చేసిన మదద్ గార్ హెల్ప్ లైన్ ద్వారా అక్కడి ప్రజలకు ఎమర్జెన్సీ సర్వీసుల్ని అందించింది.

ఈ నంబర్ కు ఆగస్టు 5 తర్వాత 34,274 ఫోన్ కాల్స్ వచ్చాయని అధికారులు చెప్పారు. కుటుంబ సభ్యులు, బంధువుల పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకునేందుకే ఎక్కువ మంది ఫోన్ చేశారని, 1,227 అత్యవసర విషయాలకు సంబంధించిన కాల్స్ వచ్చాయని తెలిపారు. కాలర్స్ అభ్యర్థనల ద్వారా.. క్యాన్సర్, డయాబెటిస్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న 123 మంది పేషంట్లకు సీఆర్పీఎఫ్ సిబ్బంది.. వారి ఇంటికి వెళ్లి మెడిసిన్ అందజేసినట్లు తెలిపారు.  ఆంక్షల సందర్భంలో కాశ్మీర్ బయట ఎగ్జామ్స్ రాయాల్సి ఉన్నవారికి ఫ్లైట్ టికెట్లు అందజేయడం, మరికొంత మందికి ఇంటర్వ్యూలు,  ఎగ్జామ్ డేట్ల మార్పుల గురించి సమాచారం అందించడం వంటి ఎన్నో సేవలు అందించినట్లు అధికారులు తెలియజేశారు.

Over 34,000 Calls On CRPF Helpline Since Centre's J&K Decision: Officials

Latest Updates