సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కు ఓవర్ స్పీడ్ ఫైన్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌కు పోలీసులు ఓవర్ స్పీడ్ ఫైన్ విధించారు. ప్రజలందరితో పాటే సీఎం వాహనాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని తెలంగాణ పోలీసులు రుజువుచేశారు.

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు మూడు ఫైన్లు విధించారు. మరో ఫైన్‌ను కోదాడ పరిధిలో విధించారు. కోదాడ సమీపంలోని శ్రీరంగాపురంలో అక్టోబర్ 16, 2019న ఒకటోది.. మాదాపూర్ పరిధిలో ఏప్రిల్ 15, 2020న రెండోది, టోలిచౌకి పరిధిలో ఏప్రిల్ 29న మూడోది, ట్యాంక్‌బండ్ పరిధిలో జూన్ 1, 2020న నాల్గోది విధించారు. ఈ నాలుగు ఫైన్లు ఓవర్ స్సీడ్‌కి చెందినవే కావడం గమనార్హం.

అయితే తాజాగా జూన్ 1న పడిన జరిమానాతో మొత్తం ఫైన్ 4,140 అయింది. సీఎం కాన్వాయ్‌కు ఫైన్ పడిన విషయం మీడియాలో రావడంతో వెంటనే స్పందించిన సీఎంవో కార్యాలయం ఫైన్లు చెల్లించింది. దాంతో ఈ-చలానాలో కారుకు సంబంధించిన విషయాలు నో పెండింగ్ చలాన్స్‌గా చూపిస్తుంది.

For More News..

హ్యపీ బర్త్‌డే బావా

ఎన్టీఆర్ ఫ్యాన్ కాకపోతే.. రేప్ చేస్తారా?

ఈజీగా కొత్త అప్పులిస్తున్నస్టేట్​ బ్యాంక్​

ఈ నెల నుంచి కొత్త కరెంట్ బిల్లులు

Latest Updates