కోడిగుడ్ల టెండర్ కోసం కొట్లాట

కర్నూలు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీకి చెందిన ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్ల టెండర్లు దక్కించుకునే విషయమై గొడవ తలెత్తింది. టెండర్ హార్డ్ కాపీలను డీఈవోకు సమర్పించే క్రమంలో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, డోన్ వైసీపీ యూత్ లీడర్ రాఘవేంద్ర గౌడ్ మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ దాడిలో డోన్ వైసీపీ యూత్ లీడర్ రాఘవేంద్ర గౌడ్, అతని డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.

Latest Updates