కాశ్మీర్‌‌ ప్రశాంతం బతుకు బండి కదిలింది

  • తొలగిన బారికేడ్లు
  • గవర్నమెంట్‌‌ ఆఫీసుల్లో ఫుల్‌‌ అటెండెన్స్‌‌

కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ప్రశాంత పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ లోయలో గురువారం చాలా చోట్ల ఆంక్షలు ఎత్తేశారు. శ్రీనగర్‌‌‌‌‌‌‌‌లోని కొన్ని ప్రాంతాల్లో బారికేడ్లను తొలగించారు. ప్రజలు నిత్యావసర సరుకుల కోసం రోడ్లపైకి వచ్చారు. గవర్నమెంట్‌‌‌‌ బస్సు సర్వీసులు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ప్రైవేటు క్యాబ్‌‌‌‌లు, ఆటోలపైనే ఆధారపడుతున్నారు.  కొన్ని ప్రాంతాల్లో మాత్రం మార్కెట్లు, షాపులు తెరుచుకోలేదు. మొబైల్‌‌‌‌, ఇంటర్నెట్‌‌‌‌ సర్వీసులను వరుసగా18వ రోజు నిలిపేశారు. స్కూళ్లు, గవర్నమెంట్‌‌‌‌ ఆఫీసుల్లో ఫుల్‌‌‌‌ అటెండెన్స్‌ ఉండగా, స్టూడెంట్లు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యారని అధికారులు చెప్పారు. ఎక్కడా ఎటువంటి గొడవలు జరగలేదన్నారు.

‘లీడర్లను విడుదల చేయండి’

పోలీసుల అదుపులో ఉన్న కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ లీడర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ ప్రతిపక్షాలు గురువారం ఢిల్లీలో ఆందోళన చేశాయి. కాంగ్రెస్‌‌‌‌, తృణమూల్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌, డీఎంకే తదితర పార్టీలకు చెందిన నేతలు ఢిల్లీలోని జంతర్‌‌‌‌‌‌‌‌మంతర్‌‌‌‌‌‌‌‌ దగ్గర ధర్నా చేశారు. ఐఎన్‌‌‌‌ఎక్స్‌‌‌‌ కేసులో అరెస్టైన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కొడుకు కార్తీ చిదంబరం కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌‌‌‌ నేతలు గులాం నబీ ఆజాద్‌‌‌‌, సీపీఐ జనరల్‌‌‌‌ సెక్రటరీ సీతారాం ఏచూరి, సీపీఎం జనరల్‌‌‌‌ సెక్రటరీ రాజా, సమాజ్‌‌‌‌వాదీ పార్టీ లీడర్‌‌‌‌‌‌‌‌ రామ్‌‌‌‌గోపాల్‌‌‌‌ యాదవ్‌‌‌‌, ఎల్‌‌‌‌జేడీఎస్‌‌‌‌ నేత శరద్‌‌‌‌ యాదవ్‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌జేడీఎస్‌‌‌‌ లీడర్‌‌ మనోజ్‌‌‌‌ ఝా, టీఎంసీకి చెందిన దినేశ్‌‌‌‌ త్రివేది తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. “కష్ట సమయంలో జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ ప్రజలకు మేం అండగా నిలబడతాం. కమ్యూనికేషన్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ చేసి, రాజకీయ నాయకులను బంధించి కేంద్రం తీసుకున్న 370 రద్దు  నిర్ణయం ఆందోళన కలిగించింది. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ప్రజా ప్రతినిధులను, అమాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌‌‌‌ చేస్తున్నాం” అని రెజల్యూషన్‌‌‌‌ పాస్‌‌‌‌ చేశారు. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఆంక్షలను ఎత్తేయాలని, మొబైల్‌‌‌‌, ఇంటర్నెట్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. 370 ఆర్టికల్‌‌‌‌ రద్దు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల కింద పలువురు రాజకీయ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

370 రద్దుకు కాశ్మీరీ పండిట్ల మద్దతు

జమ్మూ: ఆర్టికల్​370 రద్దును దేశ, విదేశాల్లోని కాశ్మీరీ పండిట్లు స్వాగతించారని పానున్​కాశ్మీర్​కన్వీనర్​అగ్నిశేఖర్​గురువారం చెప్పారు. ఇందులో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, విద్యావేత్తలు, వివిధ వర్సిటీల వీసీలు, డాక్టర్లు ఉన్నారని చెప్పారు. నిరాశ్రయులైన కాశ్మీరీ పండిట్ల తరఫున పోరాటం చేస్తున్న పానున్​కాశ్మీర్ చాలాకాలంగా జమ్మూకాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని డిమాండ్​ చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే వాళ్లు అసలు కాశ్మీరీ పండిట్లే కారని అగ్నిశేఖర్​అన్నారు.  జన్మాష్టమిని పురస్కరించుకుని సెక్యూరిటీ ఏర్పాట్లను  జమ్మూకాశ్మీర్‌‌‌‌ ఐజీపీ  ముఖేశ్‌‌‌‌ సింగ్‌‌‌‌ గురువారం రివ్యూ చేశారు. జన్మాష్టమితోపాటు శోభయాత్రకు తీసుకున్న సెక్యూరిటీ ఏర్పాట్లను జమ్మూ డీఐజీ వివేక్‌‌‌‌ గుప్తా ఐజీపీకు వివరించారు.

ఆధారాలుండే మాట్లాడుతున్నా..

న్యూఢిల్లీ: పొలిటికల్‌‌‌‌ యాక్టివిస్ట్‌‌‌‌ షెహ్లా రషీదీ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ పరిస్థితిపై మరోసారి కామెంట్స్‌‌‌‌ చేశారు. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని తాను చేసిన కామెంట్స్‌‌‌‌కు ఆధారాలు ఉన్నాయన్నారు. దీనిపై ఢిల్లీలో ఆమె జర్నలిస్ట్‌‌‌‌తో గొడవకు దిగారు. ఇండియన్‌‌‌‌ ఆర్మీ కాశ్మీరీల ఇళ్లలోకి దూరి అమాయకులను టార్చర్‌‌‌‌‌‌‌‌ చేస్తోందని ఈ నెల 18న షెహ్లా కామెంట్స్‌‌‌‌ చేశారు. ఇండియన్‌‌‌‌ ఆర్మీ విచారణ ప్రారంభిస్తే కచ్చితంగా సాక్ష్యాలు ఇస్తానన్నారు. “ నేను స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇచ్చాను. ఆర్మీ దానిపై కనీసం రియాక్ట్‌‌‌‌ కాలేదు. నా ఆరోపణలు నిజం. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చిన వాళ్లు మాట్లాడుకుంటుంటే నేను విని చెప్తున్నాను. వంట చేసుకోవడానికి కనీసం ఎల్‌‌‌‌పీజీ గ్యాస్‌‌‌‌ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు” అని అన్నారు. ట్విటర్‌‌‌‌‌‌‌‌లో చేసిన కామెంట్లకు ఆధారాలు ఇవ్వగలరా అనే  ప్రశ్నకు ఆమె సీరియస్‌‌‌‌గా సమాధానమిచ్చారు. “ నేను మీకు ఎందుకు ఇవ్వాలి? వాటిని ట్వీట్‌‌‌‌ చేస్తాను. ఇక్కడ కాదు కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ వెళ్లి అక్కడి పరిస్థితిని ప్రజలకు చూపించండి. మీరు గర్నమెంట్‌‌‌‌కు అధికార ప్రతినిధిగా ఉండాలంటే ఉండండి. నేను మాత్రం అలా ఉండలేను” అని రిపోర్టర్‌‌‌‌‌‌‌‌పై షెహ్లా సీరియస్‌‌‌‌ అయ్యారు.

Latest Updates