ప్రాణం కాపాడిన పొట్ట.. ప్రమాదం నుంచి బయటపడిన భారీకాయుడు

న్యూఢిల్లీ: అధిక బరువు వల్ల ఓ చైనా వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 130 కేజీల బరువున్న సదరు భారీకాయుడ్ని అతడి పొట్టే కాపాడింది. అవును మీరు చదివింది నిజమే. తీవ్ర ప్రమాదంలో ఉన్న ఆ వ్యక్తిని అతడి పొట్టే కాపాడింది. చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. 28 ఏళ్ల ల్యూ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు ఒక చెక్క బోర్డులో పడ్డాడు. అతడి ఛాతీ భాగం వరకు ఆ బోర్డు ఇరుక్కుంది. అధిక బరువు కారణంగా అది ఇంకా కిందకు దిగజారలేదు. ఫైర్ రెస్క్యూ సిబ్బంది ల్యూ చుట్టూ రోప్ కట్టి అతణ్ని బయటకు తీశారు. చెక్క బోర్డు నుంచి బయటకు లాగడానికి ఫైర్‌‌ఫైటర్స్‌కు సమీప గ్రామస్థులు సాయం చేశారు. వారు దాన్నుంచి బయటకు లాగేంత వరకు ల్యూ అలాగే ఎదురు చూశాడు. శరీరంపై కొన్ని చోట్ల రాపిడి తప్పిస్తే అదృష్టవశాత్తు ల్యూకు పెద్దగా గాయాలేమీ అవ్వలేదు.

Latest Updates