బీఎస్ఎఫ్​లో 67 కు పెరిగిన కేసులు

  • ఢిల్లీ, త్రిపుర బెటాలియన్ల నుంచే ఎక్కువ

న్యూఢిల్లీ: బీఎస్‌ఎఫ్‌లో కరోనా కేసుల సంఖ్య 67 కు పెరిగింది. శాంతిభద్రతల కోసం తబ్లిగి జమాత్ ప్రాంతంలో డ్యూటీ చేసిన ఢిల్లీ కి చెందిన బీఎస్ఎఫ్​ బెటాలియన్ల నుంచే అత్యధికంగా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాత త్రిపుర రాష్ట్రం నుంచి వైరస్ బారిన పడిన జవాన్లు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. త్రిపురలోని క్యాంప్ నుంచి తాజాగా 13 కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. ఇందులో 10 మంది జవాన్లు ఉండగా మిగతా ముగ్గురు వారి కుటుంబ సభ్యులు అని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రతినిధి తెలిపారు. ఢిల్లీ యూనిట్ నుంచి 41, ఆర్కేపురం బేస్ హాస్పిటల్ నుంచి 8 కేసులు, లోధి రోడ్ హెడ్ క్వార్టర్స్ లో ఒకరికి, త్రిపుర లో 13, బెంగాల్ బెటాలియన్ లో ఒకరికి వైరస్ సోకినట్లు తెలిపారు.

Latest Updates