ఓవైసీ కామెంట్స్ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి : రాజాసింగ్

హైదరాబాద్ : అయోధ్య కేసులో అసదుద్దీన్ చేసిన కామెంట్స్ భయానక వాతావరణాన్ని సృష్టింస్తున్నారని తెలిపారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. 2 మతాలకు చెందిన ప్రజలు తీర్పును స్వాగతించారని చెప్పారు. హైదరాబాద్‌ లో గానీ, ఇతర నగరాల్లో గానీ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే సహించేది లేదని ఆయన చెప్పారు. రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న ఓవైసీని అరెస్ట్ చేయాలని దేశ హోం మంత్రిత్వ శాఖకు, హోం మంత్రి అమిత్‌షాకు ట్విట్టర్‌ లో ట్యాగ్ చేశారు రాజాసింగ్.

అయోధ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పుపై అసదుద్దీన్ మాట్లాడుతూ.. ‘మాకు ఎవరి భిక్ష అవసరం లేదు. ఐదెకరాల ప్రత్యామ్నాయ భూమిని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు’ తిరస్కరించాలన్న విషయం తెలిసిందే.

Latest Updates