ఒవైసీ మత రాజకీయాలు మానుకోవాలి: బండి సంజయ్

ప్రధాని మోడీ ఇచ్చిన ఐక్యత కార్యక్రమాన్ని విమర్శించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న డాక్టర్లకు కనీసం కృతజ్ఞత తెలపని మూర్కుడు ఒవైసీ.. మత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. దేశవ్యాప్తంగా డాక్టర్లపై…కొందరు భౌతిక దాడులు, బూతులు తిట్టడం, ఉమ్మివేయడం వంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడినా వారు సహనంతో సేవలు అందిస్తున్నారన్నారు.

ప్రధాని మోడీ దీపం వెలిగించమంటే… మతమౌఢ్యంతో చూడటం ఒవైసీ అవివేకానికి నిదర్శనమన్నారు. కరోనా బారిన పడి అంతమంది ఇబ్బంది పడుతుంటే ఒవైసీ ఆస్పత్రిని ఐసోలాషన్ వార్డుకు ఇచ్చి వాళ్లకు ధైర్యం చెప్పలేని అజ్ఞాని ఒవైసీ అని ఆరోపించారు బండి సంజయ్. ఒవైసీకి దమ్ముంటే డాక్టర్లపై, నర్సులు, పోలీసులు, ఆశావర్కర్లలపై జరుగుతున్న దాడులను ఆపాలన్నారు. దీపం వెలిగించి చూడు దాని పవర్,  వెలుగుతో పాటు నీకు జ్ఞానం వస్తుందన్నారు. ఆదివారం రాత్రి నీ దారుసలేంపైకి వెళ్లి చూడు ప్రజల స్పందన నీకు కనువిందు చేస్తుందన్నారు.

పేదప్రజలు పడుతున్న ఇబ్బందిని తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం బియ్యం, పెన్షన్, గ్యాస్, జన్ ధన్ ఖాతాల్లో డబ్బులు వేస్తోందన్న విషయం కూడా ఒవైసీకి తెలియదన్నారు. రాజకీయ పబ్బం గడపడానికి నీతిమాలిన విమర్శలు చేయడం ఒవైసీ మానుకోవాలన్నారు.

దేశ ఐక్యత కోసం దీపాలు వెలిగించాలని మోడీ ఈ పిలుపునిచ్చారని…డాక్టర్లకు మనోధైర్యం అందించే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భారతీయుడు పాల్గొనాలన్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు దీపాలు వెలిగించాలన్నారు ఎంపీ బండి సంజయ్.

Latest Updates