
తమిళనాడు: పశువుల పండుగలో పెను ప్రమాదం తప్పింది. తమిళనాడు శివగంగై జిల్లా శిరావయల్ గ్రామంలో నిర్వహించిన పశువుల పండుగలో .. కట్టేసిన ఓ ఎద్దు తాడును తెంచుకుని జనంపైకి ఉరికింది. అటు వైపుగా ఓ తల్లి తన సంవత్సరం కొడుకును ఎత్తుని మరో కోడుకుతో నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఎద్దు వారిపైకి ఉరికింది. ఎద్దు వారిని చేరుకునే సమయానికి వాళ్లు కిందపడటం.. ఆ ఎద్దు వాళ్ల పై నుంచి దూకి వెళ్లటం క్షణాల్లో జరిగిపోయాయి. ఊహించని ఈ ఘటనకు అక్కడ ఉన్న వారంతా స్తంభించిపోయారు. తల్లీబిడ్డలు క్షేమంగా బయటపడ్డారు. అయితే ఇదే పరిసరాలలో ఒక వైపు జల్లికట్టు, మరో వైపు పశువుల పండుగ జరిగింది. అక్కడ డప్పుల సప్పుడుకు ఎద్దు బెదిరి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఇవికూడా చదవండి..
కేటీఆర్‌పై విచారణకు ఆదేశించండి
మజ్లిస్‌కు 6 మున్సిపాలిటీలు!…TRSతో MIM అండర్స్టాండింగ్
లెఫ్ట్ పార్టీల అబద్ధాల ప్రచారం