బ్లాక్​లో ఆక్సిజన్‌‌ సిలిండర్ల దందా

 

10 కిలోలకు రూ.11వేలకు పైనే..

ఇద్దరి అరెస్ట్‌‌.. 29 సిలిండర్లు సీజ్

హైదరాబాద్, వెలుగు: కరోనాను కొన్ని ముఠాలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఆక్సిజన్‌‌ సిలిండర్లను ‌బ్లాక్‌‌ మార్కెట్‌ ‌చేస్తూ దోచుకుంటున్నాయి. టాస్క్ ఫోర్స్‌‌ పోలీసులు శనివారం డ్రగ్ ఇన్‌‌స్పెకర్లతో కలిసి గోల్కొండ, నాంపల్లి ప్రాంతాల్లో దాడులు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. గోల్కొండ సెవెన్‌‌టూంబ్స్ వద్ద అక్రమంగా సిలిండర్లను ‌సప్లయ్‌ చేస్తున్న ఉమర్‌‌‌‌(36)ను అదుపు లోకి తీసుకుని, 25 ఆక్సిజన్‌ ‌సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి పీఎస్‌ ‌పరిధిలోని నిలోఫర్‌‌‌‌ సమీపంలో ఇబ్రహీం(34)ను అదుపులోకి తీసుకుని 4 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి పై ఎక్స్‌‌ప్లోజివ్‌ ‌అండ్‌ ‌డిజాస్టర్‌ ‌‌‌మేనేజ్‌మెంట్‌ ‌యాక్ట్ ‌కింద కేసు నమోదు చేసి రిమాండ్‌‌కి తరలించారు. పెట్రోలియం అండ్‌‌ ఎక్స్‌‌ప్లోజివ్‌ ‌సేఫ్టీ ఆరనైజేషన్ ‌లైసెన్స్‌ ‌లేకుండా ఇల్లీగల్‌‌గా దందా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 10 కిలోల సిలిండర్‌‌‌‌ను రూ.11వేల నుంచి రూ.15 వేల వరకు అమ్ముతున్నట్లు తెలిపారు. ఖాళీ సిలిండర్లను శివారు ప్రాంతాల్లోని కంపెనీల్లో రీఫిల్‌‌ చేసి సిటీలో సప్లయ్‌ చేస్తున్నట్లు గుర్తించారు.

 

Latest Updates