టాప్‌‌‌‌-3 స్టార్టప్‌‌‌‌ల్లో ఓయో, క్యూర్‌‌‌‌ఫిట్‌‌‌‌, ట్యాప్‌‌‌‌చీఫ్‌‌‌‌

  •               టాప్‌‌‌‌‌‌‌‌-25లో రేజర్‌‌‌‌‌‌‌‌పే, డంజో, ఎల్‌‌‌‌‌‌‌‌బీబీ
  •                 లింక్డ్​ ఇన్‌‌‌‌‌‌‌‌ సర్వే వెల్లడి

 

మనదేశంలోని నెంబర్‌‌‌‌వన్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌గా ఓయో హోటల్స్‌‌‌‌ అండ్‌‌‌‌ హోమ్స్‌‌‌‌ నిలిచింది. తదుపరి స్థానాల్లో క్యూర్‌‌‌‌డాట్​ఫిట్‌‌‌‌, ట్యాప్‌‌‌‌చీఫ్‌‌‌‌ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్‌‌‌‌కు చెందిన లింక్‌‌‌‌డ్‌‌‌‌ ఇన్‌‌‌‌ విడుదల చేసిన టాప్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో రేజర్‌‌‌‌పే, డంజో, లిటిల్ బ్లాక్‌‌‌‌ బుక్‌‌‌‌, మీషో, అకో జనరల్ ఇన్సూరెన్స్‌‌‌‌ కూడా చోటు దక్కించుకున్నాయి. 80కిపైగా దేశాల్లో సేవలు అందించడం, ఏడాది వాల్యుయేషన్‌‌‌‌ 10 బిలియన్‌‌‌‌ డాలర్లకు చేరడంతో ఓయోకు మొదటిస్థానం దక్కింది. వాల్యుయేషన్ భారీగా ఉండటంతో దీని డెకాకార్న్‌‌‌‌ స్థాయి కూడా దక్కింది. ఈ కంపెనీ అమెరికా, యూరప్ దేశాల్లో కో–వర్కింగ్‌‌‌‌ వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. తద్వారా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వసతికల్పన సంస్థగా అవతరించనుంది. ఆరోగ్య, ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సేవలు అందించే క్యూర్‌‌‌‌డాట్​ఫిట్‌‌‌‌ రెండో అతిపెద్ద స్టార్టప్‌‌‌‌గా నిలిచింది. మూడేళ్ల క్రితం మొదలైన ఈ కంపెనీ రెవెన్యూ 100 మిలియన్‌‌‌‌ డాలర్లుగా నమోదయింది. జమ్మూకశ్మీర్‌‌‌‌లో సేవలు అందించిన మొదటి ప్రైవేటు కంపెనీగా పేరు సంపాదించుకుంది. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో కన్సల్టేషన్‌‌‌‌ సేవలు అందించే ట్యాప్‌‌‌‌చీఫ్ మూడోస్థానంలో ఉంది. బైక్‌‌‌‌ షేరింగ్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌ బౌన్స్‌‌‌‌కు ఐదో ర్యాంకు వచ్చింది. ఆర్టిఫిషియల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే క్రౌడ్‌‌‌‌ఫండింగ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ప్లేస్‌‌‌‌ ‘ప్లేమెంట్‌‌‌‌’కు ఆరో ర్యాంకు దక్కింది. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ కన్సల్టేషన్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫారం ఎంఫైన్‌‌‌‌కు తొమ్మిదో ర్యాంకు వచ్చింది. ఈ సందర్భంగా లింక్‌‌‌‌డ్‌‌‌‌ఇన్‌‌‌‌ ఇండియా ఎండీ అదిత్‌‌‌‌ చార్లీ మాట్లాడుతూ ‘‘ఈ–లెర్నింగ్‌‌‌‌, హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌, ఫైనాన్షియల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ రంగాల్లో స్టార్టప్‌‌‌‌లు సత్తా చాటుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్నప్పటికీ ఇవి నిరుద్యోగాన్ని తగ్గిస్తున్నాయి’’ అని అన్నారు. ఇండియాలోని టాప్‌‌‌‌–25 స్టార్టప్‌‌‌‌లు గత ఏడాది 18 వేల ఉద్యోగాలు కల్పించాయని లింక్‌‌‌‌డ్‌‌‌‌ఇన్‌‌‌‌ తెలిపింది. రాబోయే ఏడాది మరో 19 వేల మందికి ఉద్యోగాలు ఇస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఉద్యోగ కల్పన, ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య, కంపెనీపై ఉద్యోగుల ఆసక్తి, ప్రతిభావంతులను ఆకర్షించే సామర్థ్యం.. తదితర బెంచ్‌‌‌‌మార్కుల ఆధారంగా టాప్‌‌‌‌–25 జాబితాను తయారు చేశామని చార్జీ వివరించారు.

Latest Updates