కరోనా ఎఫెక్ట్.. ఓయో ఉద్యోగుల జీతాలలో కోత

కరోనా ప్రభావం వలన ఉద్యోగుల జీతాలను 25శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది ఓయో హోటల్స్. ఏప్రిల్ నుంచి నాలుగు నెలలవరకు 25శాతం కోత విధిస్తున్నట్లు చెప్పింది. మరి కొందరిని సెలవులపై ఇంటికి పరిమితం చేసింది.  తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చిందని ఆ కంపెనీ   చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోహిత్ కపూర్ తెలిపారు. ఇందుకు గాను ఆయన బుధవారం నోట్ ను విడుదల చేశారు.

కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాపించడంతో హోటల్స్ బిజినెస్‌లు కుంటుపడ్డాయని రోహిత్ తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోవడం దేశీయంగా.. వ్యాపారాలు స్తంభించడంతో తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు.

Latest Updates