స్టూడెంట్లకు ఓయో డిస్కౌంట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: నీట్‌‌ వంటి కాంపిటేషన్‌‌ ఎగ్జామ్స్‌‌ రాయబోయే స్టూడెంట్స్‌‌కు తమ హోటళ్లలో, పీజీ అకామడేషన్లలో ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తామని ఓయో ప్రకటించింది. దీని వల్ల హైదరాబాద్‌‌ సహా 300కు పైగా నగరాల్లోని 24 లక్షల మంది స్టూడెంట్స్‌‌కు తక్కువ రేట్లకు అకామడేషన్‌‌ దొరుకుతుందని తెలియజేసింది. రాబోయే వారాల్లో నీట్‌‌–2020 సహా పలు పరీక్షలు జరుగుతాయి. వసతి కావాలనుకునే వాళ్ల కోసం students_stay@oyorooms.com పేరుతో ఈ–మెయిల్‌‌ హెల్ప్‌‌లైన్‌‌ కూడా ప్రారంభించినట్టు ఓయో పేర్కొంది.  కరోనా కేసులు పెరుగుతున్నందున, శుభ్రతకు మరింత ఇంపార్టెన్స్‌‌ ఇస్తున్నామని తెలియజేసింది.

For More News..

మార్కెట్‌‌ ధర కంటే మూడొంతుల తక్కువకే ఉద్యోగులకు కంపెనీ షేర్లు

కొత్త బండ్లకు డిస్కౌంట్​ కావాలంటే ఇలా చేయాల్సిందే

అడిగినోళ్లందరికీ కరోనా టెస్టులు

Latest Updates