హైదరాబాద్‌లో ఓయో ఉద్యోగిని ఆత్మహత్య

కొండాపూర్ లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హర్యానా గుర్గావ్ కు చెందిన మౌనిక(25) తన ఇద్దరు స్నేహితులతో హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. మౌనిక కొండాపూర్ లోని ఓయో హోటల్స్ లో జాబ్ చేస్తుంది. సోమవారం తన స్నేహితుడు… రీహాన్ మౌనిక ఫ్లాట్ కు వెళ్లగా ఆమె చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో 108కు కాల్ చేయగా… డ్యూటీ డాక్టర్ మౌనిక చనిపోయినట్లు చెప్పాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మౌనిక మృతిపై ఆమె నివసిస్తున్న ఫ్లాట్ యజమాని కసుల పునిత కూడా పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. తాము సోమవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో రెంట్ కోసం ఫ్లాట్ కు వెళ్లామని పోలీసులకు తెలిపారు. తమకు తెలిసిన సమాచారం ప్రకారం మౌనిక ఫ్రెండ్ రీహాన్ ఆమె ఫ్లాట్ కు 7గంటల ప్రాంతంలో వెళ్లి చూడగా ఆమె ఆత్మహత్యచేసుకుందని ఫిర్యాదులో తెలిపారు.

Latest Updates