ఓయో ‘శానిటైజ్డ్‌ బిఫోర్‌ యువర్‌ ఐస్’‌ ప్రచార క‌ర్త‌గా సోనూసుద్

క‌రోనా ప‌రిస్థితుల నుంచి దేశం మెల్ల‌మెల్ల‌గా బ‌య‌టపడుతోంది. ఈ క్ర‌మంలో వాణిజ్య , వ్యాపార మ‌రియు ఆతిథ్య‌ రంగాలు త‌మ త‌మ‌ బిజినెస్‌ను స్టార్ట్ చేశాయి. త‌మ క‌స్ట‌మ‌ర్ల‌ సెంటిమెంట్లను పరిగణలోకి తీసుకుని ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్ కూడా కరోనా ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలంటూ శానిటైజ్డ్‌ బిఫోర్‌ యువర్‌ ఐస్() అంటూ బాలీవుడ్ న‌టుడు సోనూసుద్ తో త‌న‌ ప్ర‌చారాన్ని చేప‌ట్టింది.

త‌మ హోట‌ల్స్‌లో స్టే చేసేందుకు వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల భ‌యాందోళ‌న‌లు, అనుమానాల‌ను పోగొట్టేందుకు శానిటైజ్డ్‌ బిఫోర్‌ యువర్‌ ఐస్ అనే ఓ యాడ్ ను రూపొందించింది . సోనూసుద్ ప్ర‌చార‌క‌ర్త‌గా ‘ పెహలే స్ప్రే, ఫిర్‌ స్టే’ అంటూ ఓ ప్ర‌చార చిత్రాన్ని బుధ‌వారం ‌విడుదల చేసింది. 25 సెక‌న్ల ఈ వీడియోలో క‌రోనా వైర‌స్ ప‌ట్ల తాము ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హరిస్తున్నామ‌ని, హోట‌ల్ రూమ్ అణువణువు శానిటైజ్ చేస్తున్నామ‌ని సోనూసుద్ తెలుపుతున్న‌ట్టుగా ఉంది.

 

Latest Updates