ఆదాయం పెరిగినా.. ఓయో నష్టం రూ.2385 కోట్లు

బెంగళూరుహోస్పిటాలిటీ స్టార్టప్‌‌ఓయో హోటల్స్ అండ్‌‌హోమ్స్‌‌నష్టాలు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆరు రెట్లు పెరిగి రూ.2,384.69 కోట్లకు చేరాయి. ఇదేకాలంలో ఆదాయాలు నాలుగు రెట్లకుపైగా పెరిగినా ఈ స్టార్టప్‌‌కంపెనీ నష్టాల నుంచి బయటపడలేకపోయింది. ఫలితంగా ఐపీఓకు వెళ్లడానికి మరింత సమయం పట్టవచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో దీని ఆదాయం రూ.6,457 కోట్లు కాగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,413 కోట్లని ఓయో రిజిస్ట్రార్‌‌ఆఫ్‌‌కంపెనీస్‌‌ (ఆర్‌‌ఓసీ)కు అందజేసిన వాల్యుయేషన్‌‌రిపోర్టులో ఓయో వెల్లడించింది. మొత్తం ఖర్చులు 2018లో రూ.1,835 కోట్లు కాగా, 2019 ఆర్థిక సంవత్సరంలో ఇవి ఐదు రెట్ల పెరిగి రూ.9,027.53 కోట్లు అయ్యాయి. వీటిలో అత్యధికం నిర్వహణ ఖర్చులేనని, వీటి విలువ రూ.6,131 కోట్ల వరకు ఉంటుందని తెలిపింది. నిర్వహణ ఖర్చులు కూడా 2018తో పోలిస్తే 2019లో ఐదు రెట్లు పెరిగాయి. ఇదేకాలంలో ఉద్యోగుల కోసం చేసిన ఖర్చులు ఆరు రెట్లు పెరిగి రూ.1,539 కోట్లకు చేరాయి.

ఐపీఓ లేటు ?

రాబోయే రెండుమూడేళ్లలో 18 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.28 లక్షల కోట్లు)వాల్యుయేషన్‌‌ ఐపీఓ ప్రకటించాలని ఓయో భావిస్తోంది. ఇండియాలో లిస్టింగ్‌‌రూల్స్‌‌ప్రకారం.. లిస్టింగ్‌‌కు ముందు మూడేళ్లపాటు కంపెనీ పన్నుకు ముందు లాభం ప్రకటించాలి. ప్రస్తుతం సంస్థ నష్టాల్లో ఉన్నందున సెబీ అధీనంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్‌‌ల గ్రోత్‌‌ప్లాట్‌‌ఫామ్‌‌ద్వారా ఐపీఓకు రావొచ్చు. ఈ ఏడాది జూన్‌‌లో ఇన్వెస్ట్‌‌మెంట్ల తరువాత కూడా కంపెనీ వాల్యుయేషన్‌‌5.32 బిలియన్ డాలర్లు (రూ.36.658 కోట్లు) మాత్రమే నమోదయింది. ఎంటర్‌‌ప్రైజ్‌‌వాల్యూ 755 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,400 కోట్లు) వరకు ఉంది. తాజాగా 10 బిలియన్‌‌డాలర్ల (దాదాపు రూ.71,500 కోట్లు)వాల్యుయేషన్‌‌తో సిరీస్‌‌‘ఎఫ్‌‌’ ఫండింగ్‌‌రూపంలో మరో 1.5 బిలియన్‌‌డాలర్లు (దాదాపు రూ.10,729 కోట్లు) సేకరించాలని కంపెనీ అనుకుంటోంది. ఇందులో భాగంగా ఆర్‌‌ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్‌‌700 మిలియన్‌‌డాలర్లు (దాదాపు రూ.ఐదు వేల కోట్లు) ఇన్వెస్ట్‌‌చేయనుంది. 2017లో సాఫ్ట్‌‌బ్యాంక్‌‌ఓయోలో 2.5 బిలియన్‌‌డాలర్లు ఇన్వెస్ట్‌‌చేయగా, ఆ తరువాత ఇంత మొత్తం ఇన్వెస్ట్‌‌మెంట్‌‌రావడం ఇదే తొలిసారి.

Latest Updates