ఓజోన్ రంధ్రం సైజు తగ్గింది

  • 39 లక్షల చ.కి.మీ. కు తగ్గిన హోల్
  • 1982 నుంచి ఇదే అతి చిన్న రంధ్రం
  • నాసా సైంటిస్టుల రీసెర్చ్ లో వెల్లడి

భూమిని రక్షణ కవచంలా కాపాడుతున్న ఓజోన్ పొరకు అంటార్కిటికా పై భాగంలో పడిన రంధ్రం ఈ ఏడాది చిన్నగైందట. అంటార్కిటికాపై ఓజోన్ రంధ్రం ఏటా పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. అయితే1982 నుంచీ ఉన్న రికార్డులతో పోల్చి చూస్తే ఈ ఏడాది ఓజోన్ రంధ్రం సైజు బాగా తగ్గిందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సైంటిస్టులు వెల్లడించారు. స్ట్రాటోస్పియర్లో టెంపరేచర్లు పెరగడం వల్లే ఓజోన్ పొర రంధ్రం సైజు తగ్గిందట. అంతేతప్ప.. వాతావరణంలో ఓజోన్ బాగా పెరిగిందని, ఓజోన్ పొర బాగా రికవరీ అయిందని మాత్రం భావించరాదని నాసా రీసెర్చర్లు స్పష్టం చేశారు.

సెప్టెంబరు 8న ఓజోన్ రంధ్రం సైజు 63 లక్షల చదరపు కిలోమీటర్లు ఉండగా, అక్టోబరు నాటికి అది 39 లక్షల చదరపు కిలోమీటర్లకు తగ్గిందని వారు తెలిపారు. నాసాకు చెందిన ఆరా, సౌమీ, పోలార్ శాటిలైట్ల డేటాను అనలైజ్ చేయడం ద్వారా ఓజోన్ హోల్ సైజును అంచనా వేసినట్లు చెప్పారు. టెంపరేచర్లు పెరిగితే మనకు అన్నిరకాలుగా చాలా కష్టం. కానీ.. స్ట్రాటోస్పియర్ లో టెంపరేచర్లు పెరగడం వల్లే ఓజోన్ పొరకు నష్టం తగ్గుతుందని నాసా సైంటిస్టులు అంటున్నారు. సాధారణంగా ఏటా సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో అంటార్కిటికా ప్రాంతంలో భూమిపై పడి వెనక్కి వెళ్లే సూర్యకాంతిలో ప్రత్యేక రియాక్షన్స్ జరుగుతున్నాయట. దీనివల్ల వాతావరణంలోని క్లోరిన్, బ్రోమైన్ వంటి మూలకాలు యాక్టివ్ అయిపోయి క్లౌడ్ పార్టికల్స్ పై ప్రభావం చూపుతున్నాయట.

Ozone hole is the smallest on record due to 'rare event,' NASA says

Latest Updates