మోడీపై 111 మంది తమిళ రైతుల పోటీ

బీజేపీ మోసపూరిత హామీలను దేశమంతా తెలిపేందుకు ప్రధాని మోడీపై తాము సిద్ధమవుతున్నామని తళిత రైతులు తెలిపారు. మోడీ పోటీచేసే వారణాసి లోక్ స భకు లేదా ఆయన ఎక్కడ పోటీచేసినా ‘దేశీయ తెన్నిండియా నడిగల్ ఇనయిప్పు సంఘం’ తరఫున 111 మంది రైతులను బరిలోకి దింపి మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని రైతు సంఘాల నేత అయ్యాకన్ను శనివారం మీడియాకు చెప్పారు. రైతుల హక్కులు, జీవనోపాధి కోసమే తాము పోరాటం చేస్తున్నామన్నారు . ‘మోడీ హయాంలో రైతులను బిచ్చగాళ్ల కంటే హీనంగా చూసే పరిస్థితి వచ్చింది. గిట్టు బాటు ధర లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు . కావేరి వ్యవహారం, పంటరుణాల సమస్య, ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల స్థితిగతులను తెలియజేస్తూ వారణాసిలో ప్రచారం చేస్తాం ’ అని వివరించారు. తమకు మద్దతుగా 250 మంది రైతులు తరలిస్తున్నా రని, నామినేషన్ల చివరి రోజైన ఏప్రిల్ 23న వారణాసి చేరేందుకు గంగా కావేరీ ఎక్స్​ప్రెస్​ రైలుకు శుక్రవారం టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నామని తిరుచ్చి జిల్లా రైతులు తెలిపారు.

Latest Updates