భారత్ తలచుకుంటే 24 గంటల్లో పాక్ మసైపోతుంది

భారత్ తలచుకుంటే పాకిస్థాన్ 24 గంటల్లో మసై పోతుందని పింగ్లాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాను అజయ్ కుమార్ తల్లి హెచ్చరించారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పింగ్లాన్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అవంతీపోర ఆర్మీ కాన్వాయ్‌పై దాడి సూత్రధారి ఘాజీతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనలో భారత ఆర్మీ మేజర్ సహా మరో ముగ్గురు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన నలుగురు జవాన్లలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ కు చెందిన 27 ఏళ్ల సిపాయ్ అజయ్ కుమార్ ఉన్నారు.

నా కుమారుడు దేశం కోసం ప్రాణాలొదినందుకు గర్వంగా ఉందని అజయ్ తల్లి తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆమె… పాకిస్తాన్ మన బిడ్డలను చంపుకుంటూ వెళ్తోంది… కానీ దానికి తెలియదు మనం వారి కంటే బలవంతులమని, భారత ఆర్మీ తలచుకుంటే పాక్ మొత్తాన్ని ఒకే రోజులో నాశనం చేయగలదని, ఇండియాకు ఆ శక్తిసామర్థ్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Latest Updates