హైదరాబాద్ రైతుకు పద్మశ్రీ

వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న అల్వాల్‌కు చెందిన రైతు చింతల వెంకట్ రెడ్డికి పద్మశ్రీ అవార్డు వరించింది. వెంకట్ రెడ్డి ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా పంటలు పండించి సత్ఫలితాలు సాధిస్తున్నందుకు వ్యవసాయ రంగంలో ఆయనకు పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది. వెంకట్ రెడ్డి అల్వాల్‌లో 22 డిసెంబర్ 1950లో ఓరైతు కుటుంబంలో జన్మించాడు. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ర్టీ సబ్జెక్టులతో పీయూసీ పూర్తి చేశాడు. వ్యవసాయంపై తనకున్న మక్కువతో ఎరువులు లేకుండా వరి, గోధుమ, చెరకు, మొక్కజొన్న, బాజ్రా, సోర్గం, మిల్లట్లు, కూరగాయలు పండించి సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు విత్తనాలు అందజేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం కుందన్ పల్లిలో గ్రేప్స్ పండిస్తుండగా, అల్వాల్‌లోని వ్యవసాయ క్షేత్రంలో వరి, గోధుమ, కూరగాయలు పండిస్తున్నాడు. ఇటీవల వెంకట్ రెడ్డి ద్రాక్ష తోటను వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ శాస్ర్తవేత్తల బృందం పర్యటించి పంటల సాగును పరిశీలించింది. ఈ విధానాన్ని అన్ని ప్రాంతాలకు సిఫారసు చేస్తామని ఆయనకు హామీ ఇచ్చింది. పద్మశ్రీ అవార్డు రావడంతో ఆయన ఇంటి వద్ద సందడి నెలకొంది.

For More News..

స్మార్ట్‌ ఫోన్ల వాడకంలో అమెరికాను దాటిన భారత్

యాభైవేల చెట్లు పెంచిన ఒకే ఒక్కడు.. పద్మశ్రీతో సత్కారం

లారీ డ్రైవర్‌‌‌‌గా అల్లు అర్జున్?

Latest Updates