సైనికుల మరణం కలచివేసింది: రాజ్‌నాథ్‌ సింగ్‌

అమరవీరులకు నివాళులర్పిస్తూ ట్వీట్‌

న్యూఢిల్లీ: లడాఖ్‌లో సైనికుల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, బాధకు గురి చేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఈ సందర్భంగా అమరులైన వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషయంపై బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. “ గల్వాన్‌లో సైనికులను కోల్పోవడం తీవ్రమైన బాధకు గురిచేసింది. నన్ను కలచివేసింది. విధి నిర్వహణలో మన సైనికులు ఆదర్శప్రాయమైన, ధైర్యం, శౌర్యాన్ని ప్రదర్శించారు” అని రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు. సైనికుల త్యాగాన్ని దేశం ఎప్పిటికీ మరిచిపోదని అన్నారు. సైనికుల కుటుంబాలకుప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో దేశం మొత్తం సైనికుల కుటుంబాలకు అండగా ఉంటుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఇండియా– చైనా బోర్డర్‌‌లో గత కొద్ది రోజులుగా ఉన్న పరిస్థితులు సోమవారం ఉద్రిక్తంగా మారాయి. లడాఖ్‌లో మన సైనికులపై చైనా ఆర్మీ దాడి ఆకస్మికంగా దాడి చేయడంతో 20 మంది అమరులయ్యారు. వారిలో తెలంగాణలోని సూర్యపేటకు చెందిన కర్నల్‌ సంతోష్‌ కుమార్‌‌ ఉన్నారు.

Latest Updates