బరి తెగించిన పాక్ : భారత ఆర్మీపై కాల్పులు..జవాను మృతి

శ్రీనగర్‌: పాక్ మరోసారి బరితెగించింది. జమ్ముకశ్మీర్‌ బోర్డర్ లో పాకిస్థాన్‌ బలగాలు గురువారం ఉదయం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత ఆర్మీ జవాన్లపై కాల్పులకు దిగాయి పాక్ బలగాలు. భారత సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో జవాను యశ్‌పాల్(24) మృతి చెందారు.  రాజౌరి జిల్లాలోని సుందర్‌ బాని సెక్టార్‌లో ఉన్న కెరి బెల్ట్‌ ప్రాంతంలో సరిహద్దు రేఖ వెంబడి పాక్‌ సైన్యం కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరంలో ఇప్పటికి 110 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ బలగాలు ఉల్లంఘించినట్లు అధికారికంగా తెలిపారు. ఈ దాడిలో పాక్‌ సైన్యం మోర్టార్‌ బాంబులను కూడా ప్రయోగించినట్లు వారు తెలిపారు.

Latest Updates