మిలటరీతో కశ్మీర్ సమస్య పరిష్కారం కాదు : ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్ : పుల్వామా టెర్రర్ ఎటాక్ పై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ మధ్యాహ్నం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. ఇండియా వైఖరిని ఉద్దేశించి ఈ ప్రకటన చేస్తున్నా అని చెప్పారు. ఉగ్రదాడిపై ముందే స్పందించాల్సింది కానీ… సౌదీ యువరాజు పర్యటన కారణంగా ఆలస్యం అయిందన్నారు. పుల్వామా టెర్రర్ ఎటాక్ పై ఆధారాల్లేకుండా పాకిస్థాన్ పై నిందలు వేసి అభాసుపాలు చేస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

“ఉగ్రవాదం గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి దర్యాప్తుకైనా మేం సిద్ధంగా ఉన్నాం. మేం యాక్షన్ తీసుకుంటాం. ఉగ్రవాదానికి మేం వ్యతిరేకం. ప్రతీకారం గురించి ఆలోచించడమే కాదు.. పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది కూడా. మా గడ్డపైనుంచి హింసను ప్రేరేపించే శక్తులకు ఊతం ఇవ్వకూడదనేదే మా ఉద్దేశం. ఘటనకు పాకిస్థాన్ కు సంబంధం ఉందని నిరూపిస్తే.. వారిపై ఎటువంచి చర్య అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం” అన్నారు. 

కశ్మీర్ విషయంలో ఇండియాకు కొత్త ఆలోచన ఉండాలని… కశ్మీర్ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు ఇమ్రాన్ ఖాన్. మిలటరీ బలగాలను ఉపయోగించడం.. సమస్యకు పరిష్కారం చూపదని …. ఇప్పటివరకు ఫలితం కూడా చూపలేదన్న సంగతి నిరూపితం అయిందన్నారు. కశ్మీర్ లో సైనిక బలవంతంపై ఇండియా అంతటా చర్చ జరగాల్సిన సమయం ఇది అని అన్నారు ఇమ్రాన్ ఖాన్. 

Latest Updates