పాక్ నుంచి విడుదలైన భారత మత్స్యకారులు

pak released 55 Indian fishermen and 5 civilians at Punjab, Amritsar

భారత్ తో స్నేహా పూరిత వాతావరణం కోసం పాక్ తమ జైళ్లలో బందీలుగా ఉన్న 55 మంది మత్స్యకారులు, మరో ఐదుగురు భారత పౌరులను సోమవారం విడుదల చేసింది. తమ దేశ సరిహద్దులో చేపలను వేటాడినందుకు, ప్రవేశించినందుకు గానూ  పాక్ కొంతకాలం క్రితం వారిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో  సోమవారం వారిని దేశ సరిహద్దు అటారీ- వాఘా సరిహద్దు దగ్గర విడుదల చేసింది.

ప్రస్తుతం వారంతా పంజాబ్ లోని అమృత్ సర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో శరణార్ధులుగా ఉన్నారు. భారత ప్రభుత్వ వారిని  వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

Latest Updates