పాక్‌ షూటర్లు భారత్‌కు రావొచ్చు

పుల్వామాలో CRPF జవాన్లపై ఉగ్రదాడి కారణంగా పాకిస్తాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్‌ను కట్టుదిట్టం చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను భారత్ ఉపయోగించుకుంటోంది. అయితే షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 2028 మధ్య న్యూఢిల్లీ వేదికగా షూటింగ్ ప్రపంచకప్ జరగాల్సిఉంది. కఠిన పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరించింది. టోర్నీలో పాల్గొనేందుకు వచ్చే పాక్ షూటర్లకు వీసా ఇచ్చేందుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. వరల్డ్‌ కప్‌లో పాక్ ప్లేయర్స్ కూడా పాల్గొంటారని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI) సెక్రటరీ రాజీవ్ భాటియా ఇవాళ( సోమవారం) అధికారికంగా ప్రకటించింది. హోంమంత్రిత్వశాఖ తమ ఆమోదాన్ని తెలిపిందని… వారికి వీసా మంజూరు చేస్తామని ఆయన తెలిపారు.

Latest Updates