పాక్‌ టీమ్‌ ఔట్‌ డోర్‌ ట్రెయినింగ్‌

న్యూఢిల్లీ: టెస్ట్‌‌‌‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ చేరుకున్న పాకిస్థా న్‌ క్రికెట్‌ టీమ్‌ అప్పుడే ఔట్‌ డోర్‌‌‌‌ ట్రెయినింగ్‌ మొదలుపెట్టిం ది. తొలి విడతగా వెళ్లిన 20మంది ప్లేయర్లు, 11 మంది సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌ వర్‌‌‌‌స్ట్‌‌‌‌షైర్‌‌‌‌లో క్వారంటైన్‌ లో ఉన్నారు. వీరంతా ఇంగ్లండ్‌ చేరిన వెం టనే చేసిన కరోనా టెస్ట్‌‌‌‌ల్లో అందరికీ నెగెటివ్‌ రిజల్ట్‌‌‌‌ వచ్చిందని ఈసీబీ మంగళవారం ప్రకటించింది. దీంతో టీమ్‌ అంతా వెంటనే గ్రౌండ్‌ లో అడుగుపెట్టింది. హెడ్‌ కోచ్‌ మిస్బా ఉల్‌‌‌‌ హక్‌ , బ్యాటింగ్​ కోచ్​ యూనిస్​ ఖాన్​ సమక్షంలో టీమ్‌ అంతా నెట్స్‌లో చెమటోడ్చింది. మరోపక్క ఇంకో ఆరుగురు పాక్‌ క్రికెటర్లు శుక్రవారం ఇంగ్లండ్‌ బయలుదేరనున్నారు. ఫఖర్‌‌‌‌జమాన్‌, మహ్మద్‌ హస్నైన్‌, మహ్మద్‌ హఫీజ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, షాదాబ్‌ ఖాన్‌, వహాబ్‌ రియాజ్‌ కు గతంలో కరోనా పాజిటివ్‌ రావడంతో స్వదేశంలోనే ఆగిపోయారు. ఈ ఆరుగురికి ఇటీవల చేసిన టెస్ట్ ల్లో నెగెటివ్‌ రిజల్ట్‌‌‌‌ వచ్చిందని, దీంతో ఇంగ్లండ్‌ పంపుతున్నామని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) బుధవారం  ప్రకటించింది. ఇంగ్లం డ్‌ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే కరోనా టెస్ట్‌‌‌‌ల రిజిల్ట్స్‌ వచ్చిన తర్వాత వీళ్లంతా జట్టుతో కలుస్తారు.

Latest Updates