కుప్పకూలిన పాకిస్తాన్  యుద్ధ విమానం

పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం కుప్పకూలింది. ఇవాళ(మంగళవారం) సాధారణ శిక్షణలో భాగంగా టేకాఫ్ కాగా అటాక్‌లోని పిండిగెబ్ సమీపంలో అది కుప్పకూలింది. అయితే అందులోని పైలట్ సురక్షితంగా బయటపడినట్లు పాక్ మీడియా తెలిపింది. యుద్ధ విమానం కూలిన ఘటనపై బోర్డు ద్వారా దర్యాప్తు చేయనున్నట్లు పాకిస్తాన్ వాయుసేన (PAF) చెప్పింది. ఈ ఏడాదిలో ఇలాంటి ఘటన జరగడం ఐదోసారి అని తెలిపింది.

Latest Updates