మరోసారి పప్పులో కాలేసిన పాకిస్తాన్

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ క్రాన్ ఇస్లాం గురించి చేసిన వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాలు మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి.

ఈ నేపథ్యంలో  ఫ్రాన్స్ దేశం నుంచి తన రాయబారిని వెనక్కి రప్పించాలనే తీర్మానంపై పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ  ఆమోదం తెలిపింది. అయితే ఇక్కడే పాక్ పప్పులో కాలేసింది. ఎందుకంటే పాక్ కు చెందిన రాయబారి ఫ్రాన్స్ లేడు.

మూడు నెలల క్రితం ఫ్రాన్స్ పాక్ రాయబారి  మొయిన్ ఉల్ హక్ చైనాకు బదిలీ అయ్యాడు. దీంతో అప్పటి నుంచి ఫ్రాన్స్ లో పాక్ రాయబారిలేరు. కానీ విచిత్రంగా ఫ్రాన్స్ లో ఉన్నతన రాయబారిని వెనక్కి రప్పించాలంటూ పాక్ చేసిన తీర్మానం అయోమయానికి గురిచేస్తుంది. అంతేకాదు ఈ తీర్మానం చేసిన వారిలో పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ఉన్నారు. 

విదేశాంగ కార్యాలయంలో తన విధుల్లో భాగంగా  ప్రస్తుతం పాకిస్తాన్‌కు ఫ్రాన్స్‌లో రాయబారి లేరని ఖురేషికి తెలుసు. కానీ ఖురేషి సైతం తన రాయబారిని వెనక్కి పంపించాలని తీర్మానం చేయడంపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

Latest Updates