యూఎన్‌లో బెడిసి కొట్టిన పాక్ వ్యూహం

కశ్మీర్ అంశంపై మరోసారి పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది. చైనా మద్దతుతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో లేవనెత్తేందుకు పాక్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కశ్మీర్ అంశం భారత్- పాక్ ల ద్వైపాక్షిక అంశమని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది.  అటు పాక్ తీరుపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. కుట్రలను పక్కనపెట్టి.. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అంశంపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. బుధవారం ఐక్యరాజ్య భద్రతా మండలి రహస్య సమావేశం ఏర్పాటు చేసింది.  సమావేశానికి హాజరైన చైనా.. కశ్మీర్ అంశంపై కూడా చర్చించాలని ప్రతిపాదించింది. దీనికి మిగతా సభ్య దేశాలు అంగీకరించలేదు. అయితే పాక్ కుట్రలు ఐక్యరాజ్య సమితిలో చెల్లవని… భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్ధీన్ అన్నారు.

Latest Updates