రివ్యూ పిటిషన్‌కు నిరాకరించిన కుల్‌ భూషణ్ జాదవ్‌

న్యూఢిల్లీ: తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఇండియాకు చెందిన కుల్ భూషణ్ జాదవ్‌ను దాయాది పాకిస్తాన్ నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతోంది. తాజాగా తమ కస్టడీలో ఉన్న కుల్‌ భూషణ్ జాదవ్ రివ్యూ పిటిషన్‌ వేయడానికి నిరాకరించాడని పాకిస్తాన్ తెలిపింది. దయ, విజ్ఞప్తితోనే ముందుకు సాగాలని అతడు నిర్ణయించుకున్నాడని పేర్కొంది. ‘గత నెల 17న కుల్‌ భూషణ్ జాదవ్‌ను రివ్యూ పిటిషన్ ఫైల్ చేయాల్సిందిగా కోరాం. కానీ తనకు ఉన్న చట్టపరమైన హక్కుల కారణంగా రివ్యూ పిటిషన్‌ను వేయడానికి అతడు నిరాకరించాడు’ అని పాకిస్తాన్ అడిషనల్ అటార్నీ జనరల్ తెలిపారు. పాకిస్తాన్ జాదవ్‌కు రెండో కాన్సులర్ యాక్సెస్‌ను ఆఫర్ చేసిందని స్థానిక మీడియా బుధవారం పేర్కొంది.

Latest Updates