భారత్ ఆసియా కప్ ఆడకపోతే మేము ప్రపంచ కప్ ఆడము

పాకిస్తాన్ లో జరిగే ఆసియా కప్ టీ20 లో భారత్ పాల్గొనకపోతె… భారత్ లో 2021లో జరిగే టీ20 వరల్డ్ కప్ లో తాము కూడా ఆడమని చెప్పారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ వసీమ్ ఖాన్. బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో పర్యటిస్తే ఆసియా కప్ హోస్టింగ్ రైట్స్ ను బదిలీ చేస్తేమని వస్తున్న వార్తలను వసీమ్ ఖండించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదన్నారు. ప్రస్తుతం తాము ఆసియా కప్ నిర్వహించడానికి రెండు వేదికలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే పాకిస్తాన్ లో ఆడాలా లేదా అనే విషయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాకిస్తాన్ లో తీవ్రవాదులను కట్టడిచేశాకనే ఆ దేశంతో క్రికెట్ ఆడతామని భారత్ చెప్పిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు

పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లింలను వెనక్కి పంపించాలి
టర్కీలో భూకంపం… 18మంది మృతి
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి రూ.9లక్షల ఫైన్
హాస్పిటల్ సిబ్బందిని కొట్టిన నసిరుద్దీన్ షా కూతురు

Latest Updates